luckily missed the filight accident says mla venugopala reddy

Flight with tdp mlas makes emergency landing

air india flight, technical defect, modugula venugopal reddy, chintameneni prabhakar, bonda uma maheshwar rao, shamshabad air port, intelligence DG venkateshwara Rao, Rajeev Gandhi international airport, emergency landing

Air India flight flying from Hyderabad to Vijayawada has made an emergency landing in Shamshabad Rajeev Gandhi international airport minutes after it took off.

ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఘటనపై ఎమ్మెల్యే తీవ్ర స్పందన

Posted: 08/11/2015 09:50 PM IST
Flight with tdp mlas makes emergency landing

ఉమ్మడి రాష్ట్రాల రాజధాని :హైదరాబాద్ నుంచి విజయవాడ బయలేదేరి వెళ్లిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో విమానాన్ని శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానం టేకాఫ్ తీసుకున్న కొద్ది క్షణాల్లోనే ఈ లోపం తలెత్తింది. అయితే పైలట్ అప్రమత్తంగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ విమానంలో టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, చింతమనేని ప్రభాకర్, మోదుగుల వేణుగోపాల రెడ్డిలతో పాటు ఇంటెలిజెన్స్ అదనపు డీజీ వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు.

పెద్ద ప్రమాదం తప్పడంతో వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు.  వివరాల్లోకి వెళ్తే.. ఏఐ 544 నెంబరు గల ఈ విమానం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరి టేకాఫ్ తీసుకుంది. తర్వాత పది నిమిషాల్లోనే పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. ఏటీసీని సంప్రదించడం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతి రావడం.. ఇవన్నీ అయ్యేందుకు మరో 20 నిమిషాల సమయం పట్టింది. దాంతో 4.30 గంటలకు మళ్లీ శంషాబాద్ విమానాశ్రయంలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో మొత్తం 81 మంది ప్రయాణికులు ఉన్నారని ఎయిర్ ఇండియా పీఆర్వో చెప్పారు.

ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన తర్వాత ఈ ఘటనపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి.. తాము క్షేమంగా దిగాం కాబట్టి మీడియాతో మాట్లాడుతున్నామని, లేకపోతే గాల్లోనే చనిపయేవాళ్లమని, ఈ పాటికి ఫోటోకు దండలు వేసి విచారణ జరిపిచేవారంతే అంటూ తీవ్రంగా స్పందించారు. నిన్న ఇదే విమానం రెండు గంటలు ఆలస్యంగా వెళ్లిందని... ఈరోజు కూడా ఆలస్యంగానే విజయవాడకు బయల్దేరిందని చెప్పారు. టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత మళ్లీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అన్నారు. ఆ అనౌన్స్ మెంట్ వినగానే ఫ్లైట్ లో వారంతా భయాందోళనకు గురయ్యారని చెప్పారు.

ఎయిరిండియా బాగా పాత విమానాలను వాడుతున్నారని.. ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. ప్రణాళిక ప్రకారం పాత విమానాలను స్క్రాప్లోకి నెట్టేయాల్సిన అవసరం ఉందిని కానీ అలా జరగడం లేదని ఆరోపించారు.. డీజీసీఏ తప్పనిసరిగా ప్రతి ఏడాది విమానాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలని సూచించారు.. మన దేశంలో పేదరికం వల్లనో, నిర్లక్ష్యం వల్లనో మూలపడిన విమానాలను కూడా వాడుతున్నామని చెప్పుకోచ్చారు. మన విమానాల్లో చాలామంది ప్రముఖులు, సినిమా నటులు, నాయకులు, సామన్యులు అందరూ వెళ్తుంటారు. అయినా సరిగా పట్టించుకోవడం లేదని వేణుగోపాల్ రెడ్డి విమర్శించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : air india flight  technical defect  modugula venugopal reddy  

Other Articles