Maggi exceeded lead content, violated labelling rules: Govt

Government files case against maggi seeking rs 640 crores in damages

India business report, Maggi, Maggi ban, Maggi controversy, Nestle, Nestle India, Ram vilas paswan, PM Modi,Maggi noodles, PM Modi Said Not to Make Unnecessary Noise Over Maggi Row, Ram Vilas Paswan,Maggi controversy,FSSAI, The samples, Nestle, Assocham

Acting against Nestle India over the Maggi issue, the government on Tuesday approached consumer forum NCDRC seeking damages worth Rs 640 crore from the company on charges of unfair trade practices, false labelling and misleading advertisements of the popular noodles brand.

గత్యంతరం లేక మ్యాగీపై కేంద్రం కేసు.. రూ.640 కట్టాలని డిమాండ్

Posted: 08/11/2015 09:55 PM IST
Government files case against maggi seeking rs 640 crores in damages

నెస్ట్లీ ఇండియా నుంచి వెలువడుతున్న మ్యాగీ నూడుల్స్ విషయంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో కేంద్రం కేసు నమోదు చేసింది. మూడు రోజుల క్రితం మ్యాగీ నూడుల్స్ విషయంలో అనవసర రాద్దాంతం కూడదని, అన్నీ నివేదికలు వచ్చిన తరువాతే.. వాటిపై చర్యలు తీసుకుందామని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారని చెప్పిన కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్.. ప్టేటు పిరాయించారు. మ్యాగీపై వ్యతిరేక ప్రచారంతో విదేశీ పెట్టుబడిదారులు వెనకంజ వేస్తున్నారని చెప్పి విమర్శల పాలైన ఆయన ఇకపై మ్యాగీ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని హెచ్చరికలు పంపారు.

మ్యాగీ దేశ ప్రజల ఆరోగ్యాన్ని మంటగులుపుతూ అనుచిత వ్యాపారాలు చేశారని, లేబుళ్ల మీద తప్పుడు వివరాలు ఇచ్చారని, తప్పుదోవ ప్రకటించే ప్రకటనలు చేశారని.. వీటన్నింటి దృష్ట్యా దేశానికి జరిగిన నష్టానికి గాను 640 కోట్లు రూపాయలు కట్టాలని కేసు దాఖలు చేసింది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ వద్ద కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ తొలిసారిగా ఓ కంపెనీపై కేసు పెట్టింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం వచ్చిన దాదాపు మూడు దశాబ్దాల్లో ఓ కంపెనీపై ప్రభుత్వ శాఖ ఇలా కేసు పెట్టడం ఇదే తొలిసారి.

మ్యాగీ నూడుల్స్లో సీసంతో పాటు ఎంఎస్జీ (మోనోసోడియం గ్లూటామేట్) ఎక్కువ స్థాయిలో ఉన్నాయంటూ ఆరోపణలు రావడంతో జూన్ 5న దేశవ్యాప్తంగా దాన్ని నిషేధించగా, అంతకుముందే ఉత్తర్ ప్రదేశ్ మొదలుకుని అనేక రాష్ట్రాలు మ్యాగీని బ్యాన్ చేశాయి. మూడు రోజుల క్రితం భారతీయ రిటైల్ షెల్పులలోకి మళ్లీ మ్యాగీ వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసిన కేంద్రమంత్రి.. ఆ తరువాత కూడా మ్యాగీ ల్యాబ్ టెస్టులలో ఫెయిల్ కావడంతో.. కేంద్ర ప్రభుత్వమే మ్యాగీ ఉత్పదకదారు నెస్ట్లీ ఇండియా మీద కేసు దాఖలు చేసింది. ఇంతకుముందు తాము నెస్లె కంపెనీపై కేసు పెట్టాలని సూచించామని, ఇప్పుడు తామే కేసు పెట్టామని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ తెలిపారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ప్రభుత్వం నెస్ట్లీపై కేసు పెట్టిందన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maggi ban  Nestle India  Maggi controversy  Ram vilas paswan  case  640 crores  

Other Articles