Father arrested after he let his daughter die rather than let her be touched by 'strange men'

Man lets daughter drown to avoid being touched by strange men

Dubai, Lt Col Burqibah, Ahmed Burqibah,United Arab Emirates,Middle East,Deputy Director of Dubai Police,Deputy Director of Dubai Police’s Search and Rescue Department, strange men, Father arrested, daughter drown in sea, Asian man, lifeguards

A father in Dubai was arrested after he let his daughter drown rather than let 'strange men' touch her, a top police official has said.

కాలయముడైన తండ్రి కటకటాల పాలు.. కన్న కూతరు సముద్రం పాలు..

Posted: 08/11/2015 06:20 PM IST
Man lets daughter drown to avoid being touched by strange men

ప్రాణాపాయ పరిస్థుతులలో వున్న తన బిడ్డను రక్షించాలని కోరే తండ్రులను చూశాం. కానీ అర్థం లేని నమ్మకాలతో కన్న కూతురినే చంపుకున్న తండ్రి దుబాయ్ లో కనపించాడు. తన కూతురిని అర్థనగ్నంగా ఎవరూ చూడకూడదనుకన్నాడో.. లేక పరాయి మగవాళ్లు తన కూతుర్ని తాకితే అమె అపవిత్రం అవుతుందనుకున్నాడో.. తెలియదు కానీ.. నిండు నూరేళ్లు బతకాల్సిన యువతిని కన్న తండ్రే కాలయముడుగా మారి చంపేశాడు. ముట్టుకుంటేనే మానం పోతుందని భావించిన ఓ తండ్రి ఆమెను సముద్రంలో ముంచేశాడు.

మగమృగాళ్లు ఎక్కడ ఆడ వాసన తగిలినా అక్కడ వాలి అత్యాచార పర్యాలను రచిస్తున్నా.. వారిపై తిరగబడి పోరాడాలని ధైర్యాన్ని నూరిపోసి అండగా నిలుస్తున్న ఈ సమాజంలో ఇంకా అపనమ్మకాలు, మూడ విశ్వాసాలతో కూతర్ని చంపుకున్న ఓ తండ్రి కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన కూతురితో కలిసి సోమవారం సాయంత్రం దుబాయ్‌లోని ఓ బీచ్‌కు వచ్చాడు. స్నానం చేసేందుకు ఇద్దరూ సముద్రంలోకి దిగారు. అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ కొంత దూరం కొట్టుకుపోయారు. ఇది గమనించిన రక్షక సిబ్బంది వారిని రక్షించేందుకు సముద్రంలోకి పరిగెత్తారు.

అయితే వచ్చే వారిద్దరూ మగవాళ్లు కావడంతో.. వారు తన కూతురిని ముట్టుకుంటే అమెకు చెడ్డ పేరు వస్తుందనే అపనమ్మకంతో వారికి చెయ్యి అందించ వద్దని గట్టిగా అరచి చెప్పాడు. వారికి చెయ్యి అందించ వద్దని, సముద్రంలో మునిగి పొమ్మని ఆదేశించాడు. తండ్రి మాటలను పాటించిన ఆ యువతి సముద్రంలో మునిగి చనిపోయింది. యవ్వనంలో ఉన్న తన కూతురిని వేరే మగవాళ్లెవరైనా ముట్టుకుంటే.. ఆమె ప్రతిష్టకు భంగం కలుగుతుందని భావించే అలా చేశానని అతను రక్షక సిబ్బందికి వివరించాడు. అనంతరం పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dubai  drowning  lifeguards  Swimming  woman  daughter  father  

Other Articles