Islamic State Militants Kills Judge In Libya | Crime News | ISIS Terrorists

Islamic state militants kills judge in libya crime news

isis militants, isis kills judge, isis militants crimes, isis crimes, isis libya, isis judge killed news, libyan judicial organization, isis militants kidnaps, indian kidnapped by isis

Islamic State Militants Kills Judge In Libya Crime News : Islamic state (IS) affiliates in Libya have executed a judge who was abducted a week ago, the Libyan Judicial Organisation said on Wednesday.

ఆ జడ్జిని చిత్రహింసలు పెట్టి మరీ చంపేశారు..?

Posted: 08/06/2015 11:10 AM IST
Islamic state militants kills judge in libya crime news

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల పైశాచికత్వం పీక్ స్టేజ్ కి చేరిపోయింది. తమ అధీనంలో తీసుకున్న బందీలను ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్కరిని అత్యంత దారుణమైన రీతిలో చంపేస్తున్నారు. తాజాగా న్యాయనిర్ణేతగా విధులు నిర్వహించిన ఓ జడ్జిని ఈ ఉగ్రవాదులు తీవ్ర చిత్రహింసలకు గురిచేసి చంపేశారు. గతవారం ఆయన్ను తమ బందీలోకి తీసుకున్న వారు.. చివరకు విగత జీవుడ్ని చేశారు. ఈ విషయాన్ని ఇస్లామిక్ స్టేట్ సంస్థే స్పష్టం చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. మహ్మద్ అల్ నమ్లి అనే న్యాయవాది లిబియాలో అల్ కోమ్స్ అపీల్ కోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కొందరు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సిర్టి అనే నగరంలో సాయుధులుగా వచ్చి.. ఆ జడ్జిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అలా తీసుకెళ్లినప్పటి నుంచి వారు ఆ న్యాయమూర్తిని రకరకాలుగా చిత్రహింసలకు గురిచేశారు. తనను వదిలిపెట్టేయాల్సిందిగా ఆ జడ్జి ఎంతగా వేడుకున్నప్పటికీ.. ఉగ్రవాదులు ఏమాత్రం కనుకరించకుండా తీవ్ర ఇబ్బందులు గురిచేశారు. మరోవైపు.. ఆయన్ను విడిపిపించేందుకు ప్రభుత్వం తరుపున ప్రయత్నాలు చేసినా.. ఫలితం లేకుండాపోయింది.

చివరికి ఆ ఉగ్రవాదులు పలురకాలుగా చిత్రహింసలు చేసి, నిప్పుపెట్టి కాల్చేశారు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని అల్ హరవా అనే పట్టణంలో పడేశారు. ఆ మృతదేమాన్ని పరిశీలించిన అనంతరం.. లిబియన్ జ్యుడిషియల్ ఆర్గనైజేషన్ ఆయన మృతి విషయాన్ని ధృవీకరించింది. ఇంతకి ఆ జడ్జిని ఐఎస్ఐఎస్ ఎందుకంత కిరాతకంగా చంపేసిందంటే.. జడ్జిగా విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆయన ఉగ్రవాద నేరాలకు పాల్పడిన కొందరు వ్యక్తులకు కఠిన శిక్షలు విధించారనే అక్కసుతోనే హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isis militans  judge killed isis  

Other Articles