A 22 Year Old Girl Played Rape Drama To Get Her Boyfriend | Love Affairs | Love Controversies

Girl play rape drama for boyfriend love affairs marriage issues

love drama, rape drama, girl rape drama, kidnap drama, hostel girls drama, love rape drama, girl played rape drama, girl rape story, love affairs, love controversies, marriage issues

Girl Play Rape Drama For Boyfriend Love Affairs Marriage Issues : A 22 Year Old Girl Played Rape Drama To Escape From Arrange Marriage and Get Her Boyfriend Back.

ప్రియుడి కోసం ‘అత్యాచారం’ డ్రామా..

Posted: 08/01/2015 04:26 PM IST
Girl play rape drama for boyfriend love affairs marriage issues

ప్రేమ గుడ్డిదని ప్రేమించినవాళ్లు అంటుంటారు. ప్రేమలో పడితేచాలు.. తాము జీవితంలో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించినంత రేంజులో సూక్తులు చెబుతుంటారు. వారిని పుట్టినప్పటినుంచి పోషించి, పెంచి, పెద్దచేసిన కుటుంబీకుల ప్రేమ కళ్లముందు వున్నా వారికి కనిపించదుగానీ.. కొన్నాళ్ల కిందట పరిచయమైన వారి ప్రేమలో తమ భవిష్యత్తు కనిపిస్తోందంటూ పెద్దపెద్ద డైలాగులు చెబుతుంటారు. తమ పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనని ప్రతిక్షణం తాపత్రయం పడే వారిని వదిలేసి, అసలు భవిష్యత్ అంటే ఏంటో కూడా తెలియనివారితో లేచిపోతుంటారు. అలా వెళ్లిపోతే తమ కుటుంబీకుల గౌరవం ఏమవుతుందోనన్న కనీసం ఇంకితజ్ఞానం కూడా నేటి యువతీయువకుల్లో లేదంటే.. యువత ఎటువంటి పెడదారిలో అడుగులు వేస్తోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు అదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. ఓ యువకుడి ప్రేమలో లోతుగా మునిగిపోయిన ఓ యువతి, తన ప్రేమను దక్కించుకోవడం అత్యంత నీచమైన డ్రామా ఆడింది. తన కుటుంబసభ్యుల గౌరవం ఏమవుతుందోననే విషయం కూడా పట్టించుకోకుండా ‘అత్యాచారం’ డ్రామాను క్రియేట్ చేసి.. ‘స్త్రీ’ అన్న పదానికే మచ్చ తెచ్చింది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకుంటానని 22 ఏళ్ల అమ్మాయి తన తల్లిదండ్రులకు చెప్పగా.. అందుకు వారు ఒప్పుకోలేదు. కూతురి ప్రేమ విషయం తెలియడంతో కుటుంబీకులు ఆమెకు తగిన వరుడు కోసం వేట మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న సదరు యువతి.. తల్లిదండ్రులు చేస్తున్న పెళ్లి ప్రయత్నాన్ని ఆపేందుకు ‘రేప్’ నాటకానికి తెరతీసింది. అనుకోవడమే తడువుగా తన ప్లాన్ కొనసాగించింది కానీ.. చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ 22 ఏళ్ల యువతి ఏడాదిగా తమిళనాడులోని ఈరోడ్డులో హాస్టల్ లో వుంటూ.. ఓ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అంతా సవ్యంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. జూలై 28వ తేదీన ఈమె వుంటున్న హాస్టల్ రూమ్ లో బంధించబడి వుంది. కాళ్లు, చేతులు బంధించబడి వున్న ఆ యువతిని చూసిన హాస్టల్ సిబ్బంది.. ‘ఏం జరిగింది’ అంటూ ఆమెను ఆరాతీశారు. దాంతో ఆమె తనపై ఎవరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని ఆమె తెలిపింది. అంతే.. హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే హాస్టల్ కు చేరిన పోలీసులు.. ఆ యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించి, వారిని పిలిపించారు. అక్కడి చేరుకున్న వారు తమ కుమార్తెను తీసుకుని, అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ఈ విచారణలో భాగంగా పోలీసులకు అనుమానం వచ్చింది. దాంతో వారు యువతిని తమదైన స్టైల్లో పలురకాలుగా ప్రశ్నించారు. మొదట ఆమె పొంతలేని సమాధానాలు ఇచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను గట్టిగా ప్రశ్నించారు. దాంతో ఆ యువతి నిజం ఒప్పుకుంది. తన ప్రేమికుడిని దక్కించుకోవడానికి ఈ ‘రేప్’ డ్రామా ఆడినట్టు పేర్కొంది. తనపై అత్యాచారం జరిగిందంటే పెళ్లి సంబంధాలు రావని, దాంతో తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవచ్చని చెప్పింది. ఆమె ఇచ్చిన సమాధానానికి ఆగ్రహించిన పోలీసులు.. ఇలాంటి పిచ్చివేషాలు వేసి పోలీసులకు తప్పుదోవ పట్టిస్తే, కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామంటూ యువతితోపాటు తల్లిదండ్రులను హెచ్చరించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : love drama  rape drama  arrange marriages  

Other Articles