Errabelli Dayakar Rao | KCR | Tapping

Errabelli dayakar rao demand kcr to resignation on tapping

Errabelli Dayakar Rao, KCR, Tapping, Phone Tapping, HIgh court, Telangana Govt, Tapping case

Errabelli Dayakar Rao Demand KCR to Resignation On Tapping. Telangana Govt agree the Phone tapping alligations in the High Court.

ఫోన్ ట్యాపింగ్ ఒప్పుకున్న కేసీఆర్ రాజీనామా చెయ్యాలి

Posted: 08/01/2015 08:36 AM IST
Errabelli dayakar rao demand kcr to resignation on tapping

ట్యాపింగ్‌ చేసినట్లు హైకోర్టులో ఓప్పుకున్న కెసిఆర్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని టిడిఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌భవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. గతంలో కెసిఆర్‌గాని కడియం శ్రీహరిగాని, నాయిని నర్సింహ్మరెడ్డిలు ట్యాపింగ్‌ చేయలేదని, అలాంటిది జరిగితే బయటపెట్టడంటూ పిచ్చిపిచ్చి కూతలు కూశారన్నారు. మీకు సిగ్గుందా ? ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్‌ చేసి రాజకీయ లబ్ధి కోసం కెసిఆర్‌ ప్రభుత్వం వ్యభిచారం చేసిందని విమర్శించారు.

ఎమ్మెల్యేలను బెదిరింపులు, డబ్బులు, పదవులతో లొంగదీసుకున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావ్ వెల్లడించారు. ఫోన్లను ట్యాపింగ్‌ చేసి, చేయలేదని అబద్దాలు చెప్పారన్నారు. తెలంగాణ ప్రజలకు మీరు, మీ మంత్రులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఫోన్‌ట్యాపింగ్‌ చేసిన రామకృష్ణ హెగ్డే రాజీనామా చేశారంటూ ఆ సంగతిని గుర్తు చేశారు. శిక్ష పడకముందే నీ తప్పును ఓప్పుకున్నావని, కాబట్టి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మా ఫోన్లన్నీ ట్యాప్‌ చేశారని, ఇంతకంటే ఘోరం ఇంకేం కావాలన్నారు.

వరంగల్‌లో పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లించాలని, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా రెండు పడకల ఇళ్ల నిర్మాణం వెంటనే ప్రారంభించాలనే డిమాండ్‌తో ఆగస్టు ఐదున వరంగల్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రతిసారి  1000 కోట్లు బడ్జెట్లో కేటాయించి, ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ఎన్నికల హామీ ప్రకారం ప్రతి గ్రామంలో కనీసం 100 చొప్పున రెండు పడకల ఇళ్లు నిర్మించాలని సూచించారు. ఈ అంశంపై వరంగల్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు దీక్ష చేపట్టనున్నట్లు వివరించారు. ఇందుకు అన్ని పార్టీల మద్దతు కోరినట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Errabelli Dayakar Rao  KCR  Tapping  Phone Tapping  HIgh court  Telangana Govt  Tapping case  

Other Articles