AP | Special status | Bihar | Indrajith singh

Central minister indrajith singh clear that no special staus will announce to any state

AP, Special status, Bihar, Indrajith singh, TRS, special status for ap, ap bifercation

Central Minister Indrajith singh clear that no special staus will announce to any state. He said that Bihar state didnt have the special status.

ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు... రాదు

Posted: 08/01/2015 04:26 PM IST
Central minister indrajith singh clear that no special staus will announce to any state

కొండ నాలుకకు మందేస్తే ఉన్న చందంగా తయారైంది అన్నట్లు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు అంటూ ప్రత్యేక హోదా కల్పిస్తున్న రాష్ట్రాలకు ఇప్పటి దాకా ఇస్తున్న నిధులను నిలిపివేస్తున్నట్లు లోకసభలో ప్రకటన చేసింది. ప్రత్యేక ప్యాకేజి కింద రాష్ట్రాల సామాజిక, ఆర్థిక, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు అందజేస్తున్న వివిధ పథకాలను ఈ ఆర్థిక సంవత్సరం నిలిపేశామని కేంద్రం లోక్‌సభలో తెలిపింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు పది శాతం అదనంగా నిధులు అందడమే దీనికి కారణమని తెలిపింది. కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రాలకు గతంలో 32 శాతం నిధులు మళ్లింపు జరిగేదని కానీ ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 42 శాతానికి పెంచా మని గుర్తు చేసింది. అయితే గిరిజన సబ్‌ప్లాన్‌, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 275లో పొందుపరిచిన పథకాలకు యథావిథిగా సాయం కొనసాగిస్తున్నామని ప్రకటించింది.

రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీల అంశంపై టిఆర్‌ఎస్‌ ఎంపీ బిబి పాటిల్‌, మరో ఎంపీ లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ప్రత్యేక ప్రణాళిక సాయం కింద సాధారణ హోదా కలిగిన రాష్ట్రాలకు అదనపు కేంద్ర సాయం కింద కేంద్రం నిధులు విడుదల చేసేదని తెలిపారు. అయితే 14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో రాష్ట్రాలు అత్యధికంగా కేంద్ర పన్నుల్లో పది శాతం వాటాలు పొందుతున్నాయని, దీంతో 2015-16వ ఆర్థిక సంవత్సరం నుంచి పైన పేర్కొన్న పథకాలను నిలుపుదల చేశామని తెలిపారు. మరో ప్రశ్నకు సమా ధానమిస్తూ.. ప్రత్యేక హోదా కింద 2014-15 వరకు 'సాధారణ కేంద్ర సాయం'లోని నిధుల్లో ప్రధాన భాగం (56.25 శాతం) నిధులు 11 ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు, మిగితా (43.75 శాతం) 18 సాధారణ హోదా కలిగిన రాష్ట్రాలకు పంపిణీ జరిగేదని తెలిపారు. దీంతోపాటు కేవలం 'ప్రత్యేక హోదా' కలిగిన రాష్ట్రాలకు ప్రత్యేక ప్రణాళిక సాయం (ప్రాజెక్టులకు 90 శాతం గ్రాంట్‌) అలాగే ప్రత్యేక కేంద్ర సాయం(వంద శాతం గ్రాంట్‌) కింద నిధులు సమకూర్చేవాళ్లమని తెలిపారు.

మొత్తానికి బీహార్ ఎన్నికల నేపధ్యంలో తాజాగా మరోసారి తెర మీదకు వచ్చిన ప్రత్యేక హోదా అంశంపై లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది. బీహార్ కు ప్రత్యేక హోదా కల్పించారా..? అని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా బీహార్ కు ప్రత్యేక హోదా కల్పించలేదని.... ఇక ముందు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం కుదరదు అని కూడా వెల్లడించడం ఏపి రాష్ట్రానికి విస్మయం కలిగించింది. ఏపికి ప్రత్యేక హోదా కల్పన మీద ఎన్నో ఆశలు ఉన్నాయి. విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయిన ఏపి ప్రత్యేక హోదా కల్పించడం ద్వారా వేగంగా పుంజుకుంటుంది అనే భావన ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రత్యేక హోదా మీద దాదాపు కుదరదు అని తేల్చిచెప్పేసిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఏపి ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Special status  Bihar  Indrajith singh  TRS  special status for ap  ap bifercation  

Other Articles