Minister Palle Raghunath Reddy briefed Ap cabinet meeting key decisions

Ap cabinet meets proposes to built 1 50 lakh houses for poor

AP cabinet meets, proposes to built 1.50 lakh houses for poor, AP Cabinet meet, Minister Palle Raghunath Reddy, Vijayawada, Minister Palle Raghunath Reddy, minutes of the cabinet meeting, key decisions, safeguard of universities

Minister Palle Raghunath Reddy has briefed the discussed minutes of the cabinet meeting and said that it has decided that the universities should safeguard

కలాంను స్మరించిన నవ్యాంధ్ర సర్కార్. ట్రిపిల్ ఐటీకి మహనీయుని పేరు

Posted: 07/31/2015 11:12 PM IST
Ap cabinet meets proposes to built 1 50 lakh houses for poor

దివంతగ మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జ్ఞాపకార్థం నాగార్జున వర్శిటీలో ఒక కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీకి కలాం పేరు మీద నామకరణం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో భేటీ అయిన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రతిభా అవార్డులు కలాం పేరుతో విద్యార్థులకు ఇవ్వడానికి రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు. శుక్రవారం విజయవాడలో ఏపీ కేబినెట్‌ తొలి సమావేశం జరిగింది. భేటీ ముగిసిన అనంతరం సమావేశంలో మంత్రివర్గం తీసుకున్న నిర్నయాలను మంత్రి పల్లె మీడియాకు వెల్లడించారు. ఎన్‌యూలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రిషితేశ్వరికి కేబినెట్‌ సంతాపం తెలిపినట్లు చెప్పారు. ఈ కేసుపై విచారణ వేగవంతం చేస్తామని, దోషులు ఎంతటివారైనా శిక్షిస్తామని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ర్యాగింగ్‌ అన్ని కాలేజీల్లో బ్యాన్‌ చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.

కేబినెట్‌ నిర్ణయాలు
* వర్సిటీల్లో రాజకీయ కార్యకలాపాలకు తావులేదు
* వర్సిటీల్లో బయోమెట్రిక్‌, సీసీ కెమెరాలు, ఐడీ కార్డ్స్‌ విధానం
* 75% హాజరు లేకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉండదు
* రెండో పీజీ చేసే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉండదు
* రిషితేశ్వరి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం.., రాజమండ్రిలో 500 గజాల స్థలం ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం
* అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ ప్రాజెక్టును పూర్తి చేయడం...
* 5,500 కోట్లతో ఎన్టీఆర్‌ హౌసింగ్‌ స్కీం కింద ఇళ్ల నిర్మాణం
* 1.50 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తాం...
* ఒక్కో ఇంటికి రూ.2.75 లక్షలు ఖర్చు
* ఎస్సీ, ఎస్టీలకు రూ.1.75లక్షల సబ్సిడీ, మిగిలిన వారికి లక్ష సబ్సిడీ
* సొంత స్థలాలున్నవారికి 50 వేల ఇళ్లు కేటాయింపు.
* పక్కా ఇళ్ల మరమ్మతులకు రూ.150 కోట్లు
* ప్రాధాన్యత క్రమంలో హంద్రీనీవా, గాలేరు నగరి, గుండ్లకమ్మ, పట్టిసీమ, పోలవరం కుడికాలువ, తోటపల్లి, వంశధార ప్రాజెక్టుల నిర్మాణం
* ఆగస్టు 15న పట్టిసీమ ఫేజ్‌-1ను చంద్రబాబు ప్రారంభం
* 2018లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం
* కరువు జిల్లాల్లో వలసల నివారణకు ఉపాధి హామీ పనిదినాలు 150 రోజులకు పెంపు
* అనంతపురం జిల్లాలో 20 వేల ఎకరాల్లో డ్రిప్‌ ఇరిగేషన్‌ను ప్రోత్సహిస్తాం
* ఉల్లి ధరను రూ.20కి మించి అమ్మకుండా చర్యలు, రోజుకు 220 మెట్రిక్‌ టన్నుల ఉల్లి దిగుమతి
* అన్ని శాఖలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి
* లక్ష ట్యాబ్‌ల కొనుగోలుకు నిర్ణయం, 73 వేల ట్యాబ్‌లు ఇప్పటికే వచ్చాయి, అన్ని శాఖలకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తాం
* ఆగస్టు 10 నుంచి మీ భూమి- మీ ఇంటికి కార్యక్రమం

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ap cabinet  Andrapradesh  Palle Raghunath Reddy  Vijayawada  

Other Articles