students in guntur protest dharna at ap cm camp office

Mp kavitha demands cbi probe in rishiteswari sucide case

MP kavitha demands cbi probe in rishiteswari sucide case, students in guntur protest dharna, MP kavitha, students protest, cbi probe, Rishiteswari's parents objects probe, four-member committee inquiry, suicide’ of Rishiteswari, holidays, three senior students arrested, Nagarjuna university, retired bureaucrat, retired IAS officer S Balasubramaniam, remand dairy,

MP kavitha demands cbi probe into the ‘suicide’ of Rishiteswari, as students unoins protest dharna at ap cm camp office in guntur

‘రిషితేశ్వరి’ దోషులను అరెస్టుకు విద్యార్థుల ధర్నా.. సిబిఐ విచారణకు కవిత డిమాండ్

Posted: 07/31/2015 11:00 PM IST
Mp kavitha demands cbi probe in rishiteswari sucide case

నాగార్జున వర్సిటీలో బ్యాచిలర్ ఆప్ ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం చదువుతున్నవిద్యార్థిని రుషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని నిజామాబాద్ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిజానిజాలు వెలుగుచూడాలంటే.. సిబిఐ దర్యాప్తు ఒక్కటే మార్గమని అమె వ్యాఖ్యానించారు. లిబియాలో చిక్కుకున్న అధ్యాపకుడిని విడిపించేందుకు విదేశాంగశాఖతో మాట్లాడుతున్నామని త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని కవిత తెలిపారు. హైకోర్టును విభజించాలంటూ పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు మౌన ప్రదర్శన నిర్వహించారు. హైకోర్టును విభజించే వరకు ఆందోళన చేస్తామని వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత ప్రదర్శన అనంతరం మీడియాతో మాట్టాడారు. చంద్రబాబు దురుద్దేశంతోనే స్పందించడం లేదని విమర్శించారు. ఆంధ్రా ప్రాంత విద్యుత్ ఉద్యోగుల రిలీవ్ సబబేనని వారికి జీతాలు చెల్లించే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.

ఇదిలావుండగా, రిషితేశ్వరి మృతికి కారకులైన దోషులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని, సిట్టింగ్‌ జడ్జితో రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విచారణ జరిపించాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించి బాధ్యులైన వారిని తక్షణం అరెస్టు చేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయం జరగని పక్షంలో విద్యార్థుల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి చెందిన రిషితేశ్వరి మృతిపై న్యాయ విచారణ జరిపించాలన్న డిమాండ్‌తో పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ల నేతృత్వంలో విద్యార్థులు శుక్రవారం రాష్ట్ర కేబినెట్‌ సమావేశాలు జరుగుతున్న విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు.

క్యాంపు కార్యాలయానికి వెళ్ళే ప్రధాన ద్వారాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినా వ్యూహాత్మకంగా ఒక్కొక్కరుగా విద్యార్థులు సివిల్‌ కోర్డుల దగ్గర సమీకరణ అయ్యారు. అక్కడి నుంచి ప్రదర్శనగా సీఎం క్యాంపు కార్యాలయం వైపుగా వచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయం ప్రధాన గేటు దగ్గర పోలీసులు సాధారణ భద్రతనే కల్పించారు. పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా లేరు. దీంతో విద్యార్థులు ఒక్క ఉదుటున బ్యారికేడ్లను చేధించుకుని లోపలికి ప్రవేశించే యత్నం చేశారు. ఈ దశలో లోపల ఉన్న పోలీసులు పరిగెత్తుకువచ్చి బ్యారికేడ్లను చేధించకుండా అడ్డుకున్నారు.

దీనిపై ఆగ్రహించిన విద్యార్థులు బ్యారికేడ్ల వెలుపలే ధర్నా తలపెట్టారు. ప్రిన్సిపల్‌ బాబూరావును, ర్యాగింగ్‌కు పాల్పడిన సహ విద్యార్థులు, ఒత్తిడి తీసుకు వచ్చిన విద్యార్థినులను తక్షణం అరెస్టు చేయాలని పెద్ద పెట్టున నినందించారు. కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ముఖ్యమంత్రి స్పందించటం లేదని.. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వంపై విద్యార్థులు విమర్శలకు దిగటంతో పోలీసులు విద్యార్థులను అరెస్టు చేయబోయారు. విద్యార్థులను అరెస్టు చేయటం పోలీసులకు తలకు మించిన భారమైంది. ఎట్టకేలకు విద్యార్థులందరినీ పోలీసులు అరెస్టు చేసి వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rishitheswari  MP kavitha  students protest  cbi probe  

Other Articles