Intelligence Bureau | Narendra Modi | Terror Alert | Narendra Modi, Rajiv Gandhi

Rajiv gandhi style assassination plot hatched against pm narendra modi

Intelligence Bureau, Narendra Modi, Terror Alert, Narendra Modi, Rajiv Gandhi

Intelligence Bureau on Friday warned of a possible Rajiv Gandhi-style suicide attack on Prime Minister Narendra Modi during his visit to Patna on July 25. The agency has also alerted that Pakistan’s spy agency Inter Services Intelligence (ISI) are coordinating with LeT terrorists to strike India on August 15, the day India celebrates Independence.

రాజీవ్ గాంధీలాగా మోదీని కూడా హత్య చేయడానికి ప్లాన్

Posted: 07/25/2015 08:50 AM IST
Rajiv gandhi style assassination plot hatched against pm narendra modi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీహార్ పర్యటన సందర్భంగా ఆయనపై మానవ బాంబు దాడి జరిగే ప్రమాదం ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై జరిగినట్టుగానే మోదీపై కూడా మానవ బాంబర్ దాడికి పాల్పడే ప్రమాదం ఉందని తెలిపాయి. నేడు పాట్నా వస్తున్న మోదీ ముజఫర్‌పూర్‌ ర్యాలీలో ప్రసంగిస్తారు. మోదీకి ముప్పువున్న దృష్ట్యా గరిష్ఠ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని బీహార్ ప్రభుత్వాన్ని, ఎస్‌పిజి దళాలను నిఘా వర్గాలు ఆదేశించాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో  సమాచారం.  1991లో రాజీవ్ గాంధీపై తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో ఏ తరహాలో బాంబు దాడి జరిగిందో అదే తరహాలో మోదీపై దాడి చేయడానికి కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు వెల్లడించినట్టు సమాచారం.  

rajiv-murder-02

rajiv-gandhi-murder-01

Also Read:  రాజధానిపై మరోసారి ఉగ్రపంజా! .. హెచ్చరించిన ఐబి
Also Read:  పాక్ ఉగ్రవాదుల పక్కా ప్లాన్.. మరో 3 నెలల్లో 26/11 తరహా దాడులు

ఈ తరహా దాడి కోసం  శిక్షణ పొందిన మహిళా మావోయిస్టులను ఉపయోగించే అవకాశం ఉందని కూడా  సమాచారం . మీడియా ప్రతినిధిగా, పోలీసు అధికారిగా, ఎలక్ట్రీషియన్‌గా, నిర్వాహకురాలిగా, కార్మికురాలిగా ఏదోక రూపంలో మోదీపై ఆత్మాహుతి దాడి జరిపేందుకు ప్రయత్నం జరిగే అవకాశం ఉందని తమకు సమాచారం అందిందన్నారు. బీహార్ పర్యటన సందర్భంగా ఐఐటి  పాట్నా క్యాంపస్‌ను, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజనను మోదీ ప్రారంభిస్తారు. ముజఫర్‌నగర్ ర్యాలీ ద్వారానే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ప్రచారానికి శ్రీకారం చుడతారు. ఐబి హెచ్చరికల నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన స్థాయిలోనే ప్రధాని మోదీకి భద్రతను ఏర్పాటు చేస్తున్నామని బీహార్ హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. మోదీకి ఎస్‌పిజి భద్రత ఉన్నప్పటికీ ఆయన ర్యాలీకి సంబంధించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను బీహార్ ప్రభుత్వం ఆదేశించింది. 2013 అక్టోబర్ 27న పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన మోదీ ర్యాలీలో చైన్ బాంబు పేలుళ్లు జరిగాయి. ఆ సంఘటనలో ఐదుగురు మరణించగా వంద మంది గాయపడ్డారు.

Also Read:  గగనతల దాడుల హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Intelligence Bureau  Narendra Modi  Terror Alert  Narendra Modi  Rajiv Gandhi  

Other Articles