IB issues alert ahead of Yoga Day celebrations, says flying objects may be used for attack on Rajpath

Ib issues alert ahead of yoga day celebrations at rajpath

IB issues alert ahead of Yoga Day celebrations at Rajpath, International Yoga Day June 21, national capital, police authorities, flying objects, balloons, kites, attack, high security arrangements, intelligence officials, people assembling for yoga

Ahead of the International Yoga Day on June 21, the Intelligence Bureau has issued an alert in the national capital. The IB has told the authorities of a possible use of flying objects like balloons, kites for attack during the Yoga Day celebrations at Rajpath.

గగనతల దాడుల హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు

Posted: 06/20/2015 03:32 PM IST
Ib issues alert ahead of yoga day celebrations at rajpath

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న  వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ముష్కరులు దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబీ) హై అలర్ట్ జారీ చేసింది.  యోగా డే దినం  ఉత్సవాల వేదిక రాజ్పథ్  ఆవరణలో దాడులు జరిగే అవకాశం ఉందని... అప్రమత్తంగా ఉండాలని ఐబీ హెచ్చరించింది. ఆకాశంలో ఎగిరే బెలూన్లు, గాలిపటాలు లాంటి.. వాటి ద్వారా ఈ దాడులు జరగడానికి ఆస్కారం ఉందని ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించింది.   ఈ నేపథ్యంలో బెలూన్లు, గాలిపటాలు ఎగరవేయడాన్ని ఢిల్లీ పోలీసులు నిషేధించారు.  అలాగే ఆకాశం నుంచి ఫోటోలు తీయడాన్ని కూడా నిషేధించారు.

మరోవైపు దేశ రాజధానిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అంతర్జాతీయ యోగా డే ఉత్సవాలకు భారీ సన్నాహకాలు జరిగాయి.  భద్రతా చర్యలను మరింత  కట్టుదిట్టం చేశారు. 30 కంపెనీల రక్షక దళాలు రక్షణను పర్యవేక్షిస్తున్నాయి.  అయిదు వేలమంది సాయుధ రక్షక్ష భటులతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా  రాజపథ్ చుట్టూ  మోహరించారు. ఢిల్లీలోని రాజ్ పథ్ వద్ద జరిగే కార్యక్రమంలో ప్రధాని మోడీ శ్వాస నియంత్రణ, ఇతర యోగాసనాలను ప్రదర్శించనున్నారు.  ప్రజాప్రతినిధులు, వివిధ  ప్రభుత్వ, ప్రయివేటు అధికారులు , ఎన్సీసీ  తదితరులతో కూడిన  సుమారు 35  వేలమంది ఈ మెగా ఈవెంట్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో స్థానిక పోలీసులు అప్రమత్తంగా వుండాలని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు అన్ని జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IB  alert  Yoga Day celebrations  flying objects  attack  

Other Articles