Yakub memon | Owaisi | 1993 mumbai blasts | AIMIM, Asaduddin Owaisi, Mumbai blasts

Yakub memon being executed because he is a muslim said owaisi

Yakub memon, Owaisi, 1993 mumbai blasts, AIMIM, Asaduddin Owaisi, Mumbai blasts

Yakub Memon being executed because he is a Muslim said Owaisi All India Majlis-e-Ittehadul Muslimeen chief Asaduddin Owaisi has sparked a controversy by speaking against the death penalty to 1993 Mumbai blasts convict Yakub Memon. Firing a fresh salvo, the politician has said that Memon is being executed because he is a Muslim.

ITEMVIDEOS: మెమెన్ ముస్లిం కాబట్టి వదలిపెట్టాలి: ఓవైసీ

Posted: 07/24/2015 01:12 PM IST
Yakub memon being executed because he is a muslim said owaisi

అసదుద్దీన్ ఓవైసీ.. రాష్ట్రంలోనే కాదు దేశంలో మైనార్టీల తరఫున మాట్లాడే నేతగా పేరుంది. అయితే మనది అసలే భారతదేశం.. అందరికి స్వేచ్చ ఉంటుంది. ఎవరు ఏమైనా మాట్లాడవచ్చు.. ఎంత తీవ్రంగా అయినా సరే వ్యాఖ్యలు చెయ్యవచ్చు. ఓవైసీ ఇలా వ్యాఖ్యలు చెయ్యడం.. కొత్తేమీ కాదు. ఎన్నో సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వాటి మీద పెద్ద దుమారం రేగడం మామూలే. అయితే తాజాగా ముంబై బాంబ్ దాడులకు కారణమైన యాకుబ్ మెమెన్ ను వదిలివెయ్యాలని ఎందుకంటే అతను ముస్లిం కాబట్టి అని వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది. వందల మంది అమాయకుల ప్రాణాలు తీసిన మంబై బాంబ్ దాడికి కారణమైన మెమెన్ లాంటి వాడిని వదిలిపెట్టాలని ఓవైసీ అనడం చర్చకు తెరతీసింది.

ఓవైసీకి పిచ్చి పట్టింది..
అసదుద్దీన్ ఓవైసీ.. గంతో ఎంతో కీలక నేతగా, మైనార్టీల తరఫున పార్లమెంట్ లో మాట్లాడే వారు. కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఓవైసీ ఎంతో కీలకంగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలో ఓవైసీ ఏదోలాగా పాత్ర పోషించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. కేవలం గ్రూప్ రాజకీయాలను చేస్తున్నారు. ఓ పార్టీ  అధినేతగా మాట్లాడాల్సిన ఓవైసీ కేవలం ఒక మతానికి  మాత్రమే అనుకూలంగా మాట్లాడుతూ.. మత పరంగా, రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో కూడా తెలియనంతగా మాట్లాడుతున్నారు. మెమెన్ లాంటి వాళ్లను విడుదల చెయ్యాలి అని డిమాండ్ చెయ్యడం అది కూడా ఓ ముస్లిం కాబట్టి వదిలివెయ్యాలని అని అనడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ వ్యాఖ్యలతో అవాక్కైన విమర్శకులు ఓవైసీకి సిచ్చిపట్టిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read:  పిల్లలు కనడం గురించి మీకెందుకు..? అక్బరుద్దీన్

ఓవైసీ గతంలో కూడా అంతే..
అసదుద్దీన్ ఓవైసీ గతంలో కూడా చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో భారత్ లా పుట్టిన ప్రతి ఒక్కరు ముస్లిమే అంటూ చెప్పడం వివాదాస్పదమైంది. ఓ ఎంపీగా ఉంటూ ఇలా ఓ మతపరమైన వ్యాఖ్యలు చెయ్యడం ఏంటి అని ఎంతో మంది మండిపడ్డారు. ఏదో సందర్భంలో ఓ మతానికి చెందిన ప్రార్థనా స్థలాల్లో ఏర్పాటుచేసే మీటింగ్ లలో పరుష వ్యాఖ్యలు చేయడం ఓవైసీ స్పెషాలిటి. అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేసినంత మాత్రాన అరెస్టు చెయ్యడం.. పార్లమెంట్ నుండి సస్పెండ్ చెయ్యడం జరగవు ఎందుకంటే భారతదేశంలో అందరికి మాట్లాడే స్వచ్ఛ ఉంది. ఒకవేళ ఎవరైనా తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అనుకుంటే మాత్రం తప్పనిసరి అయితే క్షమాపణలు కోరతారు.. అయితే అది కూడా వెటకారంగా. భారతదేశంలో మైనార్టీల పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే అసదుద్దీన్ ఓవైసీ లాంటి నేతల ఆటలు ఎన్ని రోజులు నడుస్తాయంటూ అనుకునే వాళ్లు అనుకుంటున్నా.. ఓవైసీ మాత్రం అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే అతనో మహానేత కాబట్టి. మేము ప్రజల పక్షం అంటూ బీరాలు పలికే ఓవైసీ లాంటి వాళ్లు అదే ప్రజల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేసే అవకాశం గ్రేట్ ఇండియాలో తప్ప మరెక్కడ ఉంటుంది.

By Abhinavachary

Also Read:  అది బూటకపు ఎన్ కౌంటర్ : అసదుద్దీన్ ఒవైసీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yakub memon  Owaisi  1993 mumbai blasts  AIMIM  Asaduddin Owaisi  Mumbai blasts  

Other Articles