Rahul gandhi | Congress | AP congress party | BJP | TDP | YSRCP

Rahul gandhi fired on bjp tdp ysrcp at anantapur tour

Rahul gandhi, Congress, AP congress party, BJP, TDP, YSRCP

Rahul Gandhi fired on BJP, TDP, YSRCP at Anantapur tour. AICC Vice President Rahul Gandhi slams TDP, BJP and YSRCP in his tour at AP.

బిజెపి, టిడిపి, వైసీపీలపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

Posted: 07/24/2015 03:31 PM IST
Rahul gandhi fired on bjp tdp ysrcp at anantapur tour

బీజేపీ, తెలుగుదేశం పార్టీలపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతుల భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ రైతుల ఇష్టంతో భూములను తీసుకోవాలని చెబితే బీజీపీ మాత్రం బలవంతంగా భుములను తీసుకోవాలని చూస్తోందన్నారు. అలాగే భూములను లాక్కునేందుకు మోదీ రహస్య ఎజెండాతో ఉన్నారన్నారు. ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం టీడీపీ ఎందుకు పోరాడడం లేదని రాహుల్ విమర్శించారు. రైతుల బాధలు టీడీపికి పట్టవా అని ప్రశ్నించారు.

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రాహుల్ గాంధీ చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 50 రూపాయల చొప్పన పంపిణీ చేశారు. చనిపోయిన రైతు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని రాహుల్ హామీ ఇచ్చారు. విభజన చట్టంలోని అంశాల్ని బీజేపీ సర్కార్ అమలు పర్చడం లేదని కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదాపై బీజేపీ మాట్లాడడం లేదని ఆయన విమర్శించారు.ఏపీ ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని రాహుల్ విరుచుకుపడ్డారు.

కష్టాల్లో ఉన్న రైతులకు భరోసా ఇచ్చేందుకే వచ్చానన్నారు రాహుల్. ఏపీలో రైతులు, చేనేతలు ఇబ్బందుల్లో ఉన్నారని వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భూములను లాక్కునేందుకు మోదీ రహస్య ఎజెండాతో ఉన్నారు. రైతుల భూములను బీజేపీ సర్కార్ బలవంతంగా గుంజుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందిరమ్మ ఆశయాలు నా రక్తంలో ఉన్నాయి. ఏపీ ప్రజల కష్టాలను తీర్చేందుకు కాంగ్రెస్ పోరాడుతుందని రాహుల్ హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీని దుమ్ముదులిపేశారు రాహుల్ గాంధీ.. టీడీపీ విధానాలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే వైసీపీని కూడా వదిలిపెట్టలేదు.. అధికార పార్టీ విధానాలపై ప్రతిపక్షం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఏపీ ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. వైసీపీ పోరాడకపోయినా మేం మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని రాహుల్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul gandhi  Congress  AP congress party  BJP  TDP  YSRCP  

Other Articles