Godavari Pushkaralu | Telangana | AP, Rajahmundry, Bhadrachalam, Kovvuru

Devotees rise in godavari puskarallo at both states

Godavari Pushkaralu, Telangana, AP, Rajahmundry, Bhadrachalam, Kovvuru

Devotees rise in Godavari puskarallo at both states. Godavari pushkaralu in telugu states going grandly. Five more days for Godavari pushkaralu.

గొదావరి పుష్కరాలకు తగ్గని భక్తజనం.. అదే తన్మయత్వం

Posted: 07/22/2015 08:38 AM IST
Devotees rise in godavari puskarallo at both states

గోదావరి పుష్కరాలు నేడు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పుష్కరఘాట్ల వద్ద భక్తులు తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని పుష్కర, కోటిలింగాల ఘాట్ల వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో పాటు కోటిపల్లిరేవు, మురమళ్ల, ముక్తేశ్వరం, రావులపాలెం, అంతర్వేది తదితర ప్రాంతాల్లోనూ పెద్దయెత్తున భక్తులు పుష్కరస్నానాలు చేస్తున్నారు. తెల్లవారుజామునుంచే పుష్కరస్నానాలకు వస్తున్న భక్తులతో ఘాట్లన్నీ రద్దీగా మారాయి. అలాగే పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, నర్సాపురం, సిద్ధాంతం, పట్టిసీమ తదితర ప్రాంతాల్లో భారీసంఖ్యలో భక్తులు పుష్కరఘాట్లకు తరలివస్తున్నారు. అటు గోదావరి పుష్కరాల సందర్భంగా తెలంగాణలోని పుష్కరఘాట్ల వద్ద రద్దీ కొనసాగుతోంది. భద్రాచలం,పర్ణశాల, మోతె, ధర్మపురి, కాళేశ్వరం, బాసర, పోచంపాడ్ తదితర క్షేత్రాల్లో పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తుతున్నారు. పుణ్యస్నానాలు అనంతరం దైవదర్శనానికి బారులు తీరడంతో ఆలయాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి.

Also Read:  పుష్కరాల్లో గాలం వేస్తే డబ్బులే డబ్బులు

గోదావరి మహా పుష్కరాలకు భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. సెలవు రోజుల్లో రద్దీ అనూహ్యంగా పెరిగినా, మిగతా రోజుల్లో ఎప్పటిలాగే పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల సంఖ్య స్థిరంగా కొనసాగుతున్నది. మరో ఐదు రోజుల్లో పుష్కరాలు ముగియనుండడంతో బుధవారం నుంచి భక్తుల సంఖ్య మళ్లీ పెరిగే అవకాశం ఉన్నదని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తున్నది. చివరి రెండు రోజుల్లో రద్దీని అంచనా వేసి అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే తెలంగాణ వ్యాప్తంగా 29,27,000 మంది పుణ్యస్నానాలు చేశారు. ఇప్పటి వరకు మూడు కోట్ల మంది స్నానాలు చేశారని, పుష్కరాలు ముగిసేనాటికి మొత్తం ఆరు కోట్ల మంది స్నానాలు చేసే అవకాశం ఉందని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు.  ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పుష్కర ఘాట్లను మంత్రి పరిశీలించారు.

Also Read:  ఇసకేస్తే రాలనంత జనం.. గోదారికి పోటెత్తిన భక్తులు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Godavari Pushkaralu  Telangana  AP  Rajahmundry  Bhadrachalam  Kovvuru  

Other Articles