KCR | Telangana | Universities | vice chancellors |chancellor, Govarnor, UGC

Kcr proposes separate chancellors for all universities

KCR, Telangana, Universities, vice chancellors, chancellor, Govarnor, UGC

Telangana Chief Minister K Chandrashekar Rao stressed the need for streamlining the functioning of all universities in the State. The Chief Minister held a review meeting at his camp office on Tuesday on the functioning of universities and appointment of Chancellors and Vice-Chancellors for them. He directed the officials to prepare the draft for new Universities Act. Objecting to the present system of having one Chancellor for all the Universities, he proposed that all universities should be headed by a dedicated Chancellor, who should be an expert academician.

ఒక్కో యూనివర్సిటికి ఒక్కో ఛాన్స్ లర్.. తెలంగాణ సర్కార్ సమాలోచనలు

Posted: 07/22/2015 08:18 AM IST
Kcr proposes separate chancellors for all universities

ఇక మీదట యూనివర్సిటి ఛాన్స్ లర్ గా గవర్నర్ ను కాకుండా.. ప్రతి యూనివర్సిటికి ఒకరిని నియమించాలని తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించి.. ఆదేశాలు జారీ చేశారు.  గవర్నర్‌ కాకుండా మరొకరిని నియమిస్తే యూజీసీ నిధులు మంజూరు చేయదని అధికారులు నచ్చజెప్పినా సీఎం కేసీఆర్‌ మాత్రం కులపతిగా మేధావులు, పారిశ్రామిక వేత్తలు, విద్యావంతులను నియమించాల్సిందేనంటూ సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.యూనివర్సిటి చట్టాన్ని సవరించేందుకు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. శాసన సభ సమావేశాలు ఇప్పట్లో జరిగే అవకాశం లేనందున ఆర్డినెన్స్‌ జారీ చేసి తద్వారా వర్శిటీల చట్టాన్ని అమల్లోకి తీసుకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లోపు ఉపకులపతుల ఎంపికకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని, ఎంపిక కోసం అన్వేషణ కమిటీలు ఏర్పాటు చేసేందుకు సంబంధిత శాఖలకు లేఖలు రాయాలని కోరినట్టు సమాచారం.

తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన విశ్వ విద్యాలయంగా పేరొందిన ఉస్మానియా వర్శిటీకి ఇంతవరకు ఉప కులపతిని నియమించలేదు. వరంగల్‌ కాకతీయ వర్శిటీకి విసి లేరు. నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వ విద్యాలయం పరిస్థితి ఇలాగే ఉంది. నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి పాలనతో నడుస్తోంది. పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ భాగ్యనారాయణ పదవీ కాలం పూర్తయినప్పటికీ తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు పదవిలో కొనసాగాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం విసి ప్రొఫెసర్ శివారెడ్డి పదవీ కాలం నాలుగు నెలల క్రితమే ముగిసింది. అయినా ఆయనను ప్రభుత్వం కొనసాగిస్తోంది. దేశంలోనే దూర విద్యలో పేరెన్నికగన్న అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి రెండేళ్ళుగా విసి లేకపోవడంతో ఐఏఎస్‌ అధికారులు ఈ విశ్వ విద్యాలయ పాలన నడిపిస్తున్నారు. కరీంనగర్‌ శాతవాహన విశ్వవిద్యాలయం విసి  ప్రొఫెసర్ వీరారెడ్డి పదవీకాలం ముగిసినా ప్రభుత్వం ఆయనను ఇన్‌చార్జ్‌గానే కొనసాగిస్తోంది.

మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం లోని ఏ విశ్వవిద్యాలయానికి పూర్తిస్థాయి ఉపకులపతి లేకపోవడంతో పాలనా గాడి తప్పిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉపకులతులు లేకపోవడంతో వర్శిటీలలో కీలక నిర్ణ యాలన్నీ ఆగిపోయాయి. రెండేళ్ళుగా ఖాళీగా ఉన్న అధ్యా పకుల నియామకాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. కాంట్రాక్ట్‌ అధ్యాపకులను నియమించి వర్శిటీలలో విద్యా ర్థులకు తరగ తులను బోధి స్తున్న పరిస్థితి నెలకొని ఉంది. ఉపకులపతులు లేకపోవడంతో రిజిస్ట్రార్లు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లెవెత్తాయి. ముఖ్యమంత్రి కార్యా లయానికి ఆయా విశ్వవిద్యాల యాల రిజిస్ట్రార్లపై ఫిర్యాదులు వచ్చాయి.కేంద్రం విశ్వవిద్యాలయాల అభివృద్ధికి ఇచ్చే నిధులు అవసరం లేకపోయినా యూజీసీ నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయాలు పనిచేయవలసిందేనని నిబంధనలను అతిక్రమించి నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందుకు వస్తాయని వారంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Telangana  Universities  vice chancellors  chancellor  Govarnor  UGC  

Other Articles