Bihar polls: Amit Shah launches GPS-fitted Parivartan Raths

Bjps hightech rath yatra 56 inch screens old video clips of lalu nitish

bjp, bjp rath yatra, bihar, bihar polls, bjp bihar polls, bjp raths, narendra modi, amit shah, nitish kumar, patna latest news, india news, bjp news, nitish kumar, lalu prasad yadav, narendra modi, bjp, bihar assembly elections, hightech rath yatra, old video clips of lalu nitish

The BJP drive is a plan to counter Bihar government’s Jan Bhagidari Manch raths, rolled out in every district, to showcase Nitish government’s achievements.

ఆ ఇద్దరి తిట్లపురాణం.. బిజేపికి ప్రచారాస్త్రం..

Posted: 07/16/2015 09:30 PM IST
Bjps hightech rath yatra 56 inch screens old video clips of lalu nitish

త్వరలో జరుగనున్న బీహార్ ఎన్నికల్లో బీజేపీ వినూత్న రీతిలో ప్రచారం చేయనుంది. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులైన లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ కలిసి మిత్రపక్షంగా ఏర్పడి బీజేపీకి వ్యతిరేకంగా బరిలోకి దిగుతున్నారు. వీరిని ఎదుర్కొనేందుకు బీజేపీ సరికొత్త రీతిలో ప్రచారం ప్రారంభించి ప్రజల మన్ననలు అందుకోవాలని యోచిస్తోంది. గతంలో ప్రత్యర్థులైన లాలూ, నితీశ్ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది. ఇప్పుడు దాన్నే తమ ప్రచారాస్త్రంగా వాడుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది.

వీరిద్దరూ ఒకరినొకరు తిట్టుకున్న క్లిప్పింగ్‌లను ప్రజలకు చూపించాలని కంకణం కట్టుకుంది. దీనికోసం 56-అంగుళాల ఎల్ఈడీ టీవీలు అమర్చిన 160 హైటెక్ ప్రచార రథాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయిస్తోంది. అలాగే లాలూ ప్రసాద్ సీఎంగా ఉన్నప్పుడు బీహార్ పరిస్థితి ఎలా ఉండేదన్న విషయాలను, లాలూ-రబ్రీదేవి అవినీతిని బీజేపీ నాయకులు వీటి ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఇక కేంద్రంలో అధికారం చేపట్టి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా వీటిలో ప్రసారం చేయనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే.. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను 253కి పెంచనున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles