అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) ప్రకటించిన వన్డే ర్యాకింగ్ లలో టీమిండియా తన రెండో స్థానాన్ని తిరిగి సొంత చేసుకుంది. జింబాబ్వేతో జరిగిన సిరీస్ లో క్లీన్ స్వీప్ చేయడంతో తిరిగి రెండో స్థానాన్ని సంపాదించుకుంది. గురువారం విడుదల చేసిన తాజా జాబితాలో అస్ట్రేలియా కన్న 14 పాయింట్లు వెనకంజలో వున్న టీమిండియా 115 పాయింట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోగా, 129 పాయింట్లతో దూసుకెళ్తున్న అస్ట్రేలియా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. కాగా, బంగ్లాదేశ్ ఈ ఏడాది వరుసగా నాలుగు సిరీస్ లను కైవసం చేసుకుని ఏడవ స్థానంలో కోనసాగుతున్నారు
బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్ టాప్-10లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లకు స్థానం లభించింది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ టోర్నీల్లో రాణించిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంకింగ్స్‌లో 4వ స్థానం సంపాదించాడు. ఇక టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 7వ ర్యాంకు దక్కించుకున్నాడు. టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 9వ ర్యాంకులో నిలిచాడు. టాప్-10లో స్థానం సంపాదించుకుని టీమిండియా బ్యాట్‌మెన్ సత్తా చాటగా, బౌలర్ల విభాగంలో టాప్-10లో ఒక్క బౌలర్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.
జింబాబ్వే పర్యటనలో ఐదు వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ కుమార్ 12వ ర్యాంకులో నిలవగా, అక్షరపటేల్ 47వ ర్యాంకు, మోహిత్ శర్మ 51వ ర్యాంకు దక్కించుకున్నారు. కాగా, సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్ 101వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. కాగా అల్ రౌండర్లలో రవించంద్రన్ అశ్విన్ కు మూడువ స్థానం లభించింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more