అసలే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. ఇలాంటి బ్యాడ్ టైంలో ఎంతో నమ్మకంగా ఉన్న సీనియర్ నేతలు పార్టీకి హ్యాండిచ్చి వెళ్లిపోవడంపై ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సీరియస్ గా తీసుకున్నారు. తెలంగాణలో డిఎస్ లాంటి సీనియర్, ఎంతో నమ్మకమైన నేత వెళ్లిపోయిన తర్వాత ఎవరి మీదా నమ్మకంగా లేరు. పార్టీలో ఉంటారో.. వెళ్లిపోతారో చెప్పండి అని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ విషయమై పార్టీలోనూ, మీడియాలోనూ రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని రాహుల్ గాంధీ సూచించినట్టు తెలిసింది. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలతో రాహుల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో పార్టీ పరిస్థితి గురించి మాట్లాడిన రాహుల్ సీనియర్లు పార్టీనుంచి వెళ్లిపోతుంటే దాన్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదని పార్టీ నేతలకు క్లాసు పీకినట్టు తెలిసింది.
Also Read: జంప్ జిలానీల్లో జానా.. ఆ కీలక భేటీయే కారణం!
డిఎస్.. ఎంతో కాలంగా పార్టీలో ఉంటూ, నమ్మని బంటులా ఉన్న వ్యక్తి. కానీ తాజాగా తన రాజకీయ ప్రస్థానానికి నాంది పలికిన కాంగ్రెస్ పార్టీని వదిలి కారెక్కారు. డీఎస్ లాంటి విశ్వాసపాత్రులైన నేతలే వెళ్లిపోతుంటే ఇంకా ఎవరిని నమ్మాలని రాహుల్ గాంధీ వాపోయినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీ దగ్గర యాక్షన్‌ప్లాన్ ఏదైనా ఉందా? అని ఆయన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారని తెలిసింది. రానున్న ఉపఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని రాహుల్ సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీని బలోపేతం తదితర అంశాలపై రాహుల్ వారితో చర్చించారు.
Also Read: టీ-లో జానాVs పొన్నాల ఫైట్
ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ స్వయంగా జానారెడ్డిని ప్రశ్నించడంతో అందరు ఆశ్చర్యపోయారు. దీనిపై జానారెడ్డి వివరణ ఇచ్చారు. అలాంటిదేమి లేదని. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని.. ఎవరెన్ని చెప్పినా, ఏ రకంగా ప్రచారం జరిగినా.తాను కాంగ్రెస్‌ను వదిలేది లేదు అని జానారెడ్డి స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎలాంటి అపోహలు, అనమానాలు వద్దని రాహుల్‌కు స్పష్టం చేసినట్లు తెలిసింది. తాజాగా పార్టీ మారిన డిఎస్ గురించి కూడారాహుల్ గాంధీ ఆరా తీసినట్లు సమాచారం. టీఆర్ఎస్లో డీఎస్‌కు ఏం ఆఫర్ ఇచ్చారు? అని రాహుల్ టీపీసీసీ నేతలను అడిగినట్టు సమాచారం. మొత్తానికి చాలా కాలం తర్వాత పార్టీని తెలుగు రాష్ట్రాల్లో చక్కదిద్దేందుకు రంగంలోకి దిగారు రాహుల్ గాంధీ. మరి రాహుల్ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తారో లేదో చూడాలి.
By Abhinavachary
Also Read: తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోంది : జానారెడ్డి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more