ఈరోజు మంత్రి జానారెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటం జరిగింది.
* రాష్ట్ర ఏర్పాటుపై ఎన్ని అడ్డంకులు, అవంతరాలు ఎదురైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
* అసెంబ్లీలో బిల్లు ప్రతులను సీమాంధ్ర నేతలు చించడం అప్రజాస్వామికమని, దీనిపై సీమాంధ్ర నేతలు వివరణ ఇవ్వాలని జానారెడ్డి డిమాండ్ చేశారు.
* స్పీకర్ నాదెండ్ల మనోహర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కొందరు ఆరోపణలు చేస్తున్నారని, ఆయనపై ప్రాంతీయ తత్వం మోపడం సరికాదని, స్పీకర్ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తారన్న విశ్వాసం తమకు ఉందని జానారెడ్డి పేర్కొన్నారు.
* అయితే వెంటనే బీఏసీ సమావేశం నిర్వహించి, బిల్లుపై చర్చించాలని, అసెంబ్లీ సమావేశాలు పొడిగించైనా బిల్లుపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.
* తెలంగాణ బిల్లు ప్రాముఖ్యతను గ్రహించాలని, 15 రోజుల్లోగా రాష్ట్రపతికి పంపాలని జానారెడ్డి పేర్కొన్నారు.
* సీమాంధ్ర నేతలు బిల్లుపై గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అవగాహన లేకే ఆందోళనకు దిగుతున్నారని, విభజన రాజ్యాంగ బద్ధంగానే జరుగుతోందని అన్నారు.
* రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్‌పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సరికాదని జానారెడ్డి అన్నారు.
* రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం దారుణమని వ్యాఖ్యానించారు. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు. ఇలా మాట్లాడడం బాబు తగదని అన్నారు.
* తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం సంతోషకరమైన విషయమని, రాష్ట్రం ఏర్పాటు చేసిన రాష్ట్రపతి, ప్రధాని, సోనియా, రాహుల్‌కు కృతజ్ఞతలు అని మంత్రి జానారెడ్డి తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more