YSRCP President Jagan Mohan Reddy Steels Ap State People Hearts With His Latest Decision | Jyothula Nehru

Jagan mohan reddy steels ap state people hearts with his decision

jagan mohan reddy, godavari pushkaralu, ap state people, hindu festivals, ap state people, ap state controversies, jagan mohan latest news, jagan mohan godavari pushkaralu

Jagan Mohan Reddy Steels Ap State People Hearts With His Decision : YSRCP President Jagan Mohan Reddy Steels Ap State People Hearts With His Latest Decision. Jagan himself christian but he is attending godavari pushkaralu.

జ‘గన్’ పేల్చాడు.. ఆంధ్రులను దోచాడు...?

Posted: 07/13/2015 04:05 PM IST
Jagan mohan reddy steels ap state people hearts with his decision

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి.. ప్రజల్లో మరింత మమేకమయ్యేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూనే వున్నారు. అందులో భాగంగానే ఆయన ఇప్పటికే ఎన్నో పాదయాత్రలు చేశారు. ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకోవడంతోపాటు వారి ఎమోషన్స్ తో, తమ ఫీలింగ్స్ కనెక్ట్ చేసి వారి మనసుల్ని దోచేసుకున్నారు. ఇలా అనేక సందర్భాల్లో తన చతురతను చాటుకున్న జగన్.. తాజాగా ఓ అరుదైన నిర్ణయం తీసుకుని తాను కూడా అవగాహన వున్న రాజకీయ నాయకుడిగా మరోసారి నిరూపించుకోవడంతోపాటు ఆంధ్రులకు మరింత దగ్గరయ్యారని సమాచారం! ఇంతకీ ఆయన ఏం చేశారు? అనేగా మీ సందేహం! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే..

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ర్టాల్లో గోదావరి పుష్కరాలు ఘనంగా సాగనున్న విషయం సంగతి తెలిసిందే. 12 ఏళ్లకోసారి జరిగే ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వుండే ప్రజలతోపాటు దాదాపు అన్ని పార్టీల నాయకులు హాజరవుతున్నారు. అయితే స్వతహాగా క్రిస్టియన్ అయిన జగన్ పుష్కరాలకు విచ్చేస్తారా? ఆయన పుష్కరస్నానం చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ వార్తలు అలాఇలా చక్కర్లు కొడుతూ చివరికి వైకాపా వర్గాలకు చేరగా.. ఆ పార్టీ  శాసనసభ పక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ అందరికి షాక్ తగిలేలా సమాధానం ఇచ్చారు. 15వ తేదీన తేదీన జగన్ రాజమండ్రి వస్తారని.. ఆ తర్వాత పుష్కర స్నానం కచ్చితంగా ఆచరిస్తారని ఆయన చెప్పారు. ఈ వార్తలు విన్న ఆంధ్రప్రజలు.. జగన్ నిర్ణయానికి దాసోహమైనట్లుగా వార్తలొస్తున్నాయి.

ఎందుకంటే.. రాజకీయ నాయకులకు తమకంటూ వ్యక్తిగత అబిప్రాయాలు, నమ్మకాలు ఎన్ని వున్నప్పటికీ.. ప్రజలకు అనుగుణంగా కొన్ని వ్యవహారాలను అనుసరిస్తే అందుకు వారు దాసోహం అవుతారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ విషయాన్ని జగన్ బాగానే ఒడిసిపట్టుకున్నారని వారు భావిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : jagan mohan reddy  godavari pushkaralu  ap state  

Other Articles