vapam scam | Governor | Ram Naresh Yadav | Madhyapradesh |

Police filed a fir on vapam scam and titled the governor as a10

vapam scam, Governor, Ram Naresh Yadav, Madhyapradesh,

Police filed a FIR on vapam scam and titled the Governor as A10.Supreme court will prosicute the petetion on vapam scam issue and governor.

ఆ కేసులో పదో నిందితుడు రాష్ట్ర గవర్నర్

Posted: 07/09/2015 08:33 AM IST
Police filed a fir on vapam scam and titled the governor as a10

సినిమాల్లోలాగా ఆ స్కాం గురించి తెలిసిన, తెలుసుకుంటున్న వారు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. చనిపొతున్నారో లేదా చంపేస్తున్నారా..? ఇలా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వ్యాపం స్కాం మీద రోజుకో సంచలనం వెలుగులోకి వస్తోంది. ఇప్పటకే యాభై మంది మృతికి పరోక్షంగా కారణమైన వ్యాపమ్ స్కాంలో మరో సంచలనానికి తెర లేచింది. ఈ  వ్యాపం కుంభకోణంలో రాష్ట్ర గవర్నర్‌ రామ్‌నరేశ్‌ యాదవ్‌ నిందితుడు నంబర్‌ 10గా ఉన్నారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని సంపాదించిన ఓ టీవీ చానెల్‌ ఈ వాస్తవాన్ని బయటపెట్టింది. రాజ్యాంగ పదవిలో ఉన్నందున గవర్నర్‌పై విచారణ కుదరదని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన్ను తక్షణం తొలగించాలని కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఈ రోజు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.

Also Read:  వ్యాపం మిస్టరీ మరణాలపై సుప్రీం జోక్యం.. ఈ నెల 9న విచారణ

దీంతోపాటు సీబీఐ దర్యాప్తును కోరుతూ దాఖలైన దిగ్విజయ్‌ తదితరులు వేసిన పిటిషన్లనూ విచారిస్తుంది. అలాగే ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుపై సీజేఐ హెచ్‌.ఎల్‌.దత్తు నేతృత్వంలోని బెంచి ఎదుట ప్రస్తావించేందుకు త్రిసభ్య ధర్మాసనం పిటిషనర్‌ను అనుమతించింది. మరోవైపు సుప్రీంలో విచారణ ప్రారంభం కానుండటంతో తమ విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు ప్రకటించింది. ఇక విచారణ పూర్తయ్యేదాకా పదవినుంచి వైదొలగాలన్న డిమాండ్‌ను ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బుధవారం ఢిల్లీలో తోసిపుచ్చారు. కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్‌ యాదవ్‌పై ఆరోపణలున్నా ఆయనను తొలగించకపోవడంపై ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్‌ భూషణ్‌ సందేహం వ్యక్తం చేశారు. లోగుట్టును ఆయనెక్కడ రట్టుచేస్తారోనన్నదే కేంద్రం భయం. అందుకే ఆ పని చేయడంలేద అని ఆయన అన్నారు. మరోవైపు సీఎం దంపతులపైనా ఆరోపణలున్నాయని, వారిని రక్షించడం కోసమే గవర్నర్‌పై నిర్ణయంలో మోదీ సర్కారు వెనక్కు తగ్గిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ ఆరోపించారు.

 Also Read :  కాటేస్తున్న కిల్లింగ్ స్కామ్.. విచారణకు హాజరైన కానిస్టేబుల్ అనుమానస్పద మృతి

వ్యాపమ్‌లో నిందితురాలైన వైద్య విద్యార్థిని నమ్రత దామర్‌ది ఆత్మహత్య కాదని, ఆమె హత్యకు గురైందని శవపరీక్ష నివేదిక తేల్చింది. దీంతో ఈ ఉదంతంపై హత్యకేసు నమోదుచేసి తాజాగా దర్యాప్తు చేపట్టాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ఇటీవల ఆమె తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేసి వస్తూండగా టీవీ జర్నలిస్టు అక్షయ్‌సింగ్‌ అంతుబట్టని రీతిలో మరణించడం తెలిసిందే. అతడి శరీర అంతఃస్రావాలను ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపాలని శవపరీక్ష నిర్వహించిన ఎయిమ్స్‌ వైద్యుల బృందం బుధవారం నిర్ణయించింది. అక్షయ్‌సింగ్‌ కుటుంబాన్ని ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎంలు అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోడియా పరామర్శించారు. అక్షయ్‌ సోదరికి ఉద్యోగం ఇస్తామన్నారు.

By Abhinavachary

Also Read:  వ్యాపమ్ స్కాంలో కలకలం రేపుతున్న వరుస అనుమానాస్పద మరణాలు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vapam scam  Governor  Ram Naresh Yadav  Madhyapradesh  

Other Articles