Groups | Telangana | TPSC | Sub commiittee | Group3, Age relaxation

Sub committee on scheme on examinations propose the telangana govt to group3 posts

Groups, Telangana, TPSC, Sub commiittee, Group3, Age relaxation

Sub committee on scheme on examinations propose the telangana govt to Group3 posts. In the undevided ap cancel the group3 posts and group3 posts merged into group2 non excecutive posts.

తెలంగాణలో ఇక గ్రూప్ 3 ఉద్యోగాలా..? సబ్ కమిటి సిఫార్సులు ఇవే..

Posted: 07/09/2015 08:07 AM IST
Sub committee on scheme on examinations propose the telangana govt to group3 posts

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి దాకా ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ కాలేదు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అవతరణ దినోత్సవం సందర్భంగా త్వరలోనే జాబ్ నోటిఫికేషన్లు జారీ చెయ్యనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అయితే తాజాగా తెంలగాణ వ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ఉద్యమం కారణంగా ఉద్యోగ అవకాశాలను కోల్పోయిన వారికి ఉద్యోగాల విషయంలో ఐదేళ్లు లేదా పదేళ్లు వయస్సు సడలింపు ఇవ్వాలనే ఆలోచన చేస్తోంది తెలంగాణ సర్కార్. దీని మీద తర్జన భర్జన పడుతోంది టి సర్కార్. అయితే పదేళ్లు కాకుండా కేవలం ఐదేళ్లు మాత్రమే సడలింపు ఇస్తే సరిపోతుంది అని కేబినెట్ కమిటి సూచించింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ భర్తీ చేసే పోస్టుల స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌పై ప్రభుత్వం నియమించిన కేబినెట్‌ సబ్‌ కమిటీ చివరి సమావేశాన్ని నిర్వహించింది.ఈ సమావేశంలొ ఉద్యోగాలకు సంబందిచి కీలక సిపార్సులను చేసింది కమిటి.

Also Read:  ఈ నెలాఖరుకల్లా ఉద్యోగ ప్రకటన

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 కేటగిరీల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో గ్రూప్‌-3 చేరింది. ఈ కేటగిరీని మళ్లీ చేర్చాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయించింది. గ్రూప్‌-2లోని నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌-3లో చేర్చింది. ఈ గ్రూప్‌లోని పోస్టులకూ ఇంటర్వ్యూలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.  నియామకాల్లో అనుసరించాల్సిన అంశాలపై ప్రభుత్వానికి కమిటీ పలు కీలక సిఫారసులు చేసింది. గతంలో ఉద్యోగాల్లో గ్రూప్‌1, 2, 3, 4 కేటగిరీలు ఉండేవి. అయితే కాల క్రమంలో గ్రూప్‌-3ని రద్దు చేసి ఆ పోస్టులను గ్రూప్‌-2ఎ, బిలుగా విభజించారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను ‘బి’లో చేర్చారు. ఆ తర్వాత ‘ఏ, బీ’లను రెండింటినీ రద్దు చేసి.. ఎగ్గిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను ఒకే చెట్టు కిందకు తీసుకొచ్చారు. అంటే గ్రూప్‌-2 ద్వారానే రెండు రకాల పోస్టుల నియామకాలు చేపట్టారు.

Also Read:  ఎప్పుడెప్పుడు.. ఉద్యోగ ప్రకటన ఎప్పుడు..?

ప్రస్తుతం కేబినెట్‌ సబ్‌ కమిటీ మళ్లీ కొత్తగా గ్రూప్‌-3ని తెరపైకి తెచ్చింది. గ్రూప్‌-3 ద్వారా ఎంపికయ్యే ఉద్యోగి తన సామర్థ్యాన్ని బట్టి కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌ స్థాయి వరకు పదోన్నతి పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేవలం రాత పరీక్ష ఆధారంగా నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు నియామకాలు చేపట్టడం సబబు కాదని భావించిన కేబినెట్‌ సబ్‌కమిటీ ఇంటర్వ్యూలను నిర్వహించాల్సిందేనని అభిప్రాయపడింది. ఇక, గ్రూప్‌-2 ద్వారా కేవలం ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్‌-1లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే మెయిన్స్‌లో అదనంగా ఓ పేపర్‌ను చేర్చారు. మార్కులు పెంచారు. గ్రూప్‌-4 ఉద్యోగాలను మాత్రం పాతపద్ధతిలోనే భర్తీ చేయనున్నారు. గ్రూప్‌-2, 3, 4 పరీక్షలను ఆబ్జెక్టివ్‌ పద్ధతిలోనే నిర్వహిస్తారు. జూనియర్‌ లెక్చరర్ల పోస్టులకు మాత్రం ఆబ్జెక్టివ్‌, డిస్ర్కిప్టివ్‌, ఇంటర్వ్యూల ఆధారంగా నియామకాలు చేపడతారు. నిరుద్యోగుల వయో పరిమితిని ఐదేళ్లు సడలించాల్సిందిగా కేబినెట్‌ సబ్‌కమిటీ సిఫారసు చేసింది. ప్రతిపక్షాలు ఒప్పుకొంటే పదేళ్లయినా సడలిస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ గతంలో ప్రకటించారు. కానీ సబ్‌ కమిటీ మాత్రం ఐదేళ్లకు సిఫారసు చేసింది.

By Abhinavachary

Also Read:  తెలంగాణ గ్రూప్స్ పరీక్షల సిలబస్ మార్పు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Groups  Telangana  TPSC  Sub commiittee  Group3  Age relaxation  

Other Articles