rajasthan police arrests hema malini driver mahesh thakur | hema malini accident | bollywood

Rajasthan police arrests hema malini driver mahesh thakur

rajasthan police hema malini, hema malini accident, hema malini incident, hema malini news, hema malini updates, hema malini accident photos, hema malini car accident

rajasthan police arrests hema malini driver mahesh thakur : On friday morning rajasthan police arrests hema malini driver mahesh tagore for driving with high speed.

హేమమాలిని కారు డ్రైవర్ అరెస్ట్.. ఎందుకంటే!

Posted: 07/03/2015 09:43 AM IST
Rajasthan police arrests hema malini driver mahesh thakur

ఒకప్పటి బాలీవుడ్ డ్రీంగర్ల, బీజేపీ ఎంపీ హేమమాలిని గురువారం రాత్రి రాజస్థాన్ లోని దౌసా వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే! ఆమె మధుర నుంచి జైపూర్ కి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈమె ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజి కారు, ఎదురుగా వస్తున్న ఆల్టో కారు ఒక్కసారిగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో హేమమాలిని తలకు దెబ్బతగలగా ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఓ నాలుగేళ్ల చిన్నారి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఇక ఆ చిన్నారి కుటుంబానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు.

ఇదిలావుండగా.. హేమమాలిని కారు డ్రైవర్ అయిన మహేష్ ఠాకూర్ ని రాజస్థాన్ పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఆ డ్రైవర్ మితిమీరిన వేగంతో నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని తెలిసింది. దీంతో.. ఉద్రిక్త పరిస్థితులు ఎక్కడ తలెత్తుతాయనే ఉద్దేశంతో పోలీసులు అతనిని పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం. అటు నుదుటికి తీవ్రగాయాలైన హేమమాలినిని జైపూర్ లోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు ఆమెకు మెరుగైన చికిత్స అందించారు. ఆమె కనుబొమ్మల వద్ద కుట్లు వేసి.. స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుందని వైద్యులు పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hema malini injured  car accident  driver mahesh thakur  

Other Articles