Chandrababau, Modi, Social media, elections, Cash for vote

Social media support the modi in the elections but that media now complecated for chandrababu naidu

Chandrababau, Modi, Social media, elections, Cash for vote

Social media support the Modi in the elections but that media now complecated for chandrababu naidu. Chandrababu naidu getting counter publisity.

అప్పుడు మోదీ కి ప్లస్.. ఇప్పుడు బాబుకు మైనస్

Posted: 07/03/2015 09:01 AM IST
Social media support the modi in the elections but that media now complecated for chandrababu naidu

ఎన్నికల సమయంలో  నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తి, దేశ మొత్తం ఒక ఉప్పనకు కారణమైంది సోషల్ మీడియా. నరేంద్ర మోదీకి బాసటగా ఎన్నికల ప్రచారం చేసిన సోషల్ మీడియా పాత్రను ఎవరూ కాదనలేరు. నరేంద్ర మోదీ చరిష్మాను అమాంతం పెంచేసి.. ఎన్నికల్లో భారీ మెరిటీతో బిజెపి పార్టీకి, నరేంద్ర మోదీకి అధికారాన్ని కట్టబెట్టింది సోషల్ మీడియా. అందుకే సోషల్ మీడియా అంటే మోదీకి ఎంతో ఇష్టం. ఏ విషాయన్నైనా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చెయ్యడం మోదీకి అలవాటు. అయితే అదే టెక్నాలజీవాడుకునే విషయంలో అందరి కన్నా ముందుండే చంద్రబాబునాయుడు మాత్రం సోషల్ మీడియా అస్సలు కలిసిరావడం లేదు. ఓటుకు నోటు వివాదం ప్రారంభం నుండి చంద్రబాబు నాయుడు మీద వస్తున్న కామెంట్లు చూస్తున్న వారెవరైనా పాపం చంద్రబాబు అంటూ జాలిపడుతున్నారు.

babu-01

babu02

సోషల్ మీడియాను ఎంతో సమర్థవంతంగా వాడటంలో మోదీ, చంద్రబాబు నాయుడు ముందుటారు. అయితే మోదీ విషయాన్ని పక్కనబెడితే చంద్రబాబు నాయుడు మీద గత కొంత కాలంగా ఆరోపణల పర్వం సాగుతోంది. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అందరికి విస్మయాన్ని, కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అయితే సోషల్ మిడియాలో మల్ చల్ చేస్తున్న వార్తలు అన్నీ కూడా రియాలిటీకి దగ్గరగా ఉండటంతో నెటిజన్లు కూడా లైక్ లు కొడుతున్నారు. అయితే ఇలా మోదీకి మాత్రం కలిసి వచ్చిన సోషల్ మీడియా, చంద్రబాబు నాయుడుకు మాత్రం కలిసి రావడం లేదు. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా సాగుతున్న ప్ర,చారం తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టాన్ని, ఏపిలో పార్టీపై ప్రభావాన్ని చూపగలదు. ఈ ప్రచారాన్ని మొదలుపెట్టిన వారి అసల ఉద్దేశం కూడా ఇదే కావచ్చు. మరి దీనిపై కూడా చంద్రబాబు నాయుడు మౌనంగా ఉంటారా.? లేదా సోసల్ మీడియాలో ప్రచారాన్ని తిప్పి కొడతారా చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Chandrababau  Modi  Social media  elections  Cash for vote  

Other Articles