University college of london scientists proves trametinib drug will increase the age | Researches

University college of london scientists proves trametinib will increase age

trametinib drugs, trametinib capsules, london university scientists, age increase tablets, trametinib tablets, healthy drugs, health tips

University college of london scientists proves trametinib will increase age : University college of london scientists proves that the trametinib drug will increase age. It effects on ras protein way and helps to increase age.

అందరికీ శుభవార్త.. మరణాన్ని వాయిదా వేసుకోవచ్చు!

Posted: 07/03/2015 10:22 AM IST
University college of london scientists proves trametinib will increase age

ఒకప్పుడు మానవులు నూరేళ్లవరకు ఆరోగ్యంగానే జీవించేవారు.. కానీ కాలక్రమంలో మానవుని జీవన విధానంలో మార్పులు రావడంతో అతని కాలపరిమాణం తగ్గుతూ వచ్చింది. ఇక ప్రస్తుతకాలంలో వాతావరణ కాలుష్య ప్రభావం కారణంగా సగటు మానవుడు 60 ఏళ్లు బతకడమే విశేషంగా మారిపోయింది. అయితే.. తాజాగా నిర్వహించిన ఓ పరిశోధన.. వృద్ధాప్యాన్ని దగ్గరకు చేరనివ్వకపోవడంతోపాటు మరికొంత ఎక్కువ కాలంపాటు జీవించవచ్చునని నిరూపించింది.

ఈ అధ్యయనాన్ని నిర్వహించిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకుల ప్రకారం.. చర్మ కేన్సర్ చికిత్సలో భాగంగా వాడే ట్రామోటినిబ్ ఔషధాన్ని వృద్ధాప్యాన్ని దూరం చేసేందుకు ఉపయోగించవచ్చు. తద్వారా మరణాన్ని వాయిదా వేసుకోవచ్చని తమ పరిశోధనలో వెలువడిన ఫలితం ఆధారంగా వారు పేర్కొంటున్నారు. పరిశోధకులు తమ ప్రయోగంలో భాగంగా పూలపై వాలే ఈగలను ఎంచుకున్నారు. ఆ ఈగల్లో ట్రామోటినిబ్ డ్రగ్ ను ప్రవేశపెట్టారు. అలా ఔషధాన్ని ప్రవేశపెట్టిన ఈగలను సాధారణ ఈగలతో పోల్చితే 12 శాతం ఎక్కువకాలం జీవించాయని తేలింది. ఈ పరిశోధన ఆధారంగా వారు మరణాన్ని వాయిదా వేసుకోవచ్చని పేర్కొంటున్నారు.

‘ఈగలతోపాటు జంతువులు, మానవుల్లో వుండే ఆర్ఏఎస్ ప్రొటీన్ మార్గాన్ని మందగించేట్టు చేయడం ద్వారా వయసును మరింత పెంచుకోవచ్చు. ట్రామోటినిబ్ డ్రగ్ ఆర్ఏఎస్ మార్గాన్ని ప్రభావితం చేయగలుతుంది. తద్వారా వృద్ధాప్యాన్ని దగ్గరకు చేరనివ్వకుండా మరణాన్ని కొంతకాలంపాటు వాయిదా వేసుకోవచ్చు’ అని ఈ అధ్యయనాన్ని చేపట్టిన శాస్త్రజ్ఞులు వెల్లడించారు. రాబోయే 10-20 ఏళ్లల పూర్తిస్థాయి చికిత్సా విధానాలు అందుబాటులోకి రాగలవని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మరి.. ఇంకా ఎక్కువకాలంపాటు జీవించాలని ఆశిస్తున్నవారికి ఇది శుభవార్తే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trametinib drugs  healthy drugs  age increase tablets  

Other Articles