Marri Shashidhar Reddy | Talasani Srinivas Yadav | Governor | narasimhan, Telangana, Cabinet, Minister

Marri shashidhar reddy wrote a letter to governor narasimhan about the talasanis episode

marri Shashidhar Reddy, Talasani Srinivas Yadav, Governor, narasimhan, Telangana, Cabinet, Minister

Marri Shashidhar Reddy wrote a letter to Governor Narasimhan about the Talasanis episode. enior Congress leader and former minister Marri Shashidhar Reddy wrote a letter to Governor Narasimhan seeking clarification on the resignation of Sanathnagar MLA Talasani Srinivas Yadav, who won on a Telugu Desam party ticket and later shifted to TRS and went on to become a minister in the TRS cabinet. On completion of six months of Srinivas Yadav taking oath as minister in the state cabinet, Shashidhar Reddy said that Srinivas Yadav had repeatedly telling that he had resigned to his MLA post before joining the cabinet.

నరసింహన్ చూస్తావా లేదంటే కోర్టుకు వెళతా

Posted: 07/03/2015 08:38 AM IST
Marri shashidhar reddy wrote a letter to governor narasimhan about the talasanis episode

గవర్నస్ నరసింహన్ మీద విమర్శల వర్షం కురిపించారు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి. తెలంగాణ మంత్రి వర్గంలో ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ వ్యవహారంపై మర్రి శశిధర్ రెడ్డి గవర్నర్ పై లేఖాస్త్రాన్ని ఎక్కుపెట్టారు. గవర్నర్ చేస్తున్నది న్యాయమా అంటూనే సునిశిత విమర్శలు చేశారు. 2014 ఎన్నికల్లో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సనత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే. కానీ... తలసాని చేత టీఆర్‌ఎస్‌ పార్టీ నడుపుతున్న ప్రభుత్వంలో మంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేయించారు  అంటూ గవర్నర్‌ వైఖరిని మర్రి శశిధర్‌ రెడ్డి తప్పుపట్టారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూలులో పేరాగ్రాఫ్‌ (2)(ఎ)ను తలసానితోపాటు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా ఉల్లంఘించినట్లయిందని తెలిపారు. గవర్నర్ కు రాజ్యాంగం అన్ని అధికారాలను ఇచ్చినప్పటికీ, విధి నిర్వహణలో విఫలమయ్యారని తెలిపేందుకు చింతిస్తున్నా అంటూ లేఖలో మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ రాజ్యాంగేతర చర్యలకు గవర్నర్‌ నరసింహన్‌ కొమ్ముకాస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌ రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం.. అనర్హత వేటు విధించాల్సిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారంటూ మండిపడ్డారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పార్టీ ఫిరాయింపు కింద తప్పు చేసినట్లేనని, ఆయనపై అనర్హత విధించాలని తెలిపారు. పార్టీ ఫిరాయింపు వర్తించే రోజు నుంచే తలసానిపై అనర్హత కూడా వర్తిస్తుందని తెలిపారు. కానీ, ఆయన ప్రజాస్వామ్య సిద్ధాంతాలను ధిక్కరిస్తూ పదవిలో కొనసాగుతున్నారని మర్రి శశిధర్‌ రెడ్డి తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోప్రకారం తలసాని ఒక్కరోజు కూడా శాసనసభ్యునిగా కొనసాగేందుకు వీల్లేదని తెలిపారు. మరోవైపు 2014 డిసెంబర్‌ 16న మంత్రి పదవి స్వీకరించినందున, ఆరు నెలల తర్వాత కూడా ఆయన పదవిలో కొనసాగడం రాజ్యాంగ, చట్ట విరుద్ధమని మర్రి శశిధర్‌ రెడ్డి గవర్నర్‌కు తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన మీరుతెలంగాణ ప్రభుత్వ రాజ్యాంగేతర చర్యలు, కార్యకలాపాలను కాపాడుతున్నారని చెబుతూనే రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ గవర్నర్‌ రామ్‌లాల్‌ను గుర్తుపెట్టుకునే ఉన్నారు. మొత్తంగా గవర్నర్ చేస్తున్న తప్పును పాత కేసుల ఆధారంగా వివరించారు మర్రి. అయితే ఇది మీకు న్యాయమా అని ప్రశ్నిస్తూనే.. చివర్లో దీనిపై కోర్టుకు వెళ్లేందుకు కూడా వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు. చివరగా ఒక మాట... ఎస్‌ఆర్‌ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మీపైనా కోర్టులో రిట్‌ వేయవచ్చు. దీని మేరకు మీరు రాజ్యాంగ పదవిలో ఉండకూడదు అని రాయడం లెట్టర్ మొత్తానికి హైలెట్ గా నిలిచింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : marri Shashidhar Reddy  Talasani Srinivas Yadav  Governor  narasimhan  Telangana  Cabinet  Minister  

Other Articles