mathayya | Call data | Ap | SIT \ tapping, Threat

Service providers said that security threat to nation by the mathayya call data

mathayya, Call data, Ap, SIT, tapping, Threat

Service Providers said that security threat to nation by the Mathayya call data. In the court, service providers said that if they reveal the call data of Mathayya, the nation has security threat.

మత్తయ్య కాల్ డేటా బయటకు వస్తే దేశ భద్రతకు ముప్పా..?

Posted: 07/03/2015 08:14 AM IST
Service providers said that security threat to nation by the mathayya call data

ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య కాల్ డేటా కోసం సిట్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. పైగా కొత్త కొత్త షాక్ లు తగులుతున్నాయి. జెరూసలెం మత్తయ్య కాల్ డేటా ను బయట పెడితే దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతుందని సర్వీస్ ప్రొవైడర్లు కోర్టుకు లిఖిత పూర్వకంగా రాసిచ్చారు. ఏపి సిఎం చంద్రబాబు, మరి కొందరి ఫోన్లను ట్యాప్ చెయ్యడానికి సర్వీస్ ప్రొవైడర్ల మీద తెలంగాణ నేతలు వత్తిడి చేశారని గత కొంత కాలంగా ఏపి అధికారుుల వాదిస్తున్నారు. అయితే దీనిపై ఆధారాలను సేకరించడంలో భాగంగా మత్తయ్య కాల్ డేటాను సిట్ అధికారులు సర్వీస్ ప్రొవైడర్లను కోరగా వారి స్పందన సిట్ కు షాకింగ్ గా మారింది. ముందు నెల రోజుల టైం పడుతుందని తెలిపిన సర్వీస్ ప్రొవైడర్లు ఇప్పుడు ఏకంగా మత్తయ్య కాల్ డేటా బయటకు వస్తే మాత్రం దేశ భద్రతమే ముప్పు వాటిల్లుతుందని కోర్టుకు తెలిపారు.

సర్వీస్ ప్రొవైడర్ల కాల్ డేటా ను ఇవ్వాలని చెప్పి సిట్‌ అధికారులు విజయవాడ కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం వాటికి సమన్లు జారీ చేసింది. కోర్టుకు హాజరైన సర్వీస్‌ ప్రొవైడర్లు తమ వాదన వినిపించారు. అయితే ఆధారాలను బయట పెట్టొద్దని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు తమపై ఒత్తిడి తెస్తున్నారని వారు వెల్లడించారు. దాంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మాట్లాడితే మీరు కం టెంట్‌ ఆఫ్‌ కోర్టు అవుతారు తెలుసా..?’ అనడంతో వెంటనే మాటమార్చి తమకు నెల సమయం కావాలన్నారు. ఏపీ పోలీసులు అడిగిన నెంబర్లపై తాము కేంద్ర హోం శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉందని చెప్పా రు. ఆ నెంబర్లలో దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన విషయాలు ఉన్నాయని రాతపూర్వక సమాధానంలో వివరించారు. అయితే, తాము మత్తయ్య, ఆయన భార్య, సోదరుడు, సెబాస్టియన్‌ కాల్‌డేటా వివరాలు అడిగామని, వాళ్లంతా సామాన్యులేనని, వారితో దేశ అంతర్గత భద్రతకు ముప్పు ఉండడం ఏంటని ఏపీ పోలీసులు విస్మయం వ్యక్తం చేశారు. సోదరుడిని కాపాడుకోలేక అత్తారింట్లో దాక్కున్న మత్తయ్య అంతర్గత భద్రతకు ముప్పు కలిగిస్తా డా..? అని ప్రశ్నిస్తున్నారు. టీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, హోం శాఖ కార్యదర్శి ఇప్పటికే సెలవుపై వెళ్లడంతో సీసీఎస్‌ పోలీసులు సర్వీస్‌ ప్రొవైడర్లపై ఒత్తిడి తెస్తున్నారని భావిస్తున్నారు. కాగా, సిట్‌, సీఐడీ అధికారులతో డీజీపీ జేవీ రాముడు సమీక్షించారు. మొత్తానికి సర్వీస్ ప్రొవైడర్లు సమాధానం సిట్ అధికారులకు, ఏపి పోలీసులకు మాత్రం షాక్ ఇచ్చింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mathayya  Call data  Ap  SIT  tapping  Threat  

Other Articles