Telangana Minister KTR Counter Attack On Narendra Modi Tweet | Twitter | Emergency

Telangana minister ktr counter on narendra modi tweet

ktr, ktr news, ktr twitter, ktr updates, ktr news, ktr controversy, ktr tweet, ktr counter modi, ktr tweet modi, narendra modi twitter, narendra modi tweets, modi twitter updates, ktr with modi

Telangana Minister KTR Counter On Narendra Modi Tweet : Telangana IT Minister KTR Counter Attack On Narendra Modi's Emergency Tweet.

‘ట్విటర్’లో మోడీకి కౌంటరిచ్చిన కేటీఆర్

Posted: 06/26/2015 10:23 AM IST
Telangana minister ktr counter on narendra modi tweet

సామాజిక మాధ్యమమైన ‘ట్విటర్’లో ప్రధాని నరేంద్రమోడీ నిరంతరం యాక్టివ్ గానే వుంటారు. ఆ మాధ్యమం వేదికగా ఆయన రాజకీయ వ్యవహారాలను తెలియజేయడంతోపాటు ప్రజలకు సందేశాత్మకంగా ట్వీట్లు చేస్తుంటారు. అలాగే.. కొన్ని చారిత్రిక ఘట్టాలపై ఆయన అప్పుడప్పుడు స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా ‘ఎమర్జెన్సీ’ విషయమై ట్వీట్ చేశారు. ‘దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి యుగం’ అని ఆయన పేర్కొన్నారు. దేశంలో ‘ఎమర్జెన్సీ’ అమలై 40 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆయన తన ట్విటర్ అకౌంట్ లో గురువారం అలా ట్వీట్ చేశారు. ఇలా మోడీ చేసిన ఈ ట్వీట్ కు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో ఘాటుగానే స్పందించారు.

‘గౌరవనీయులైన ప్రధానిగారు.. 40 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాదులో శాంతిభద్రతలపై, ప్రజాస్వామ్యంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హక్కును కాలరాస్తారని/ఉల్లంఘిస్తారని వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై మీరు వివేకవంతంగా వ్యవహరిస్తారని.. చరిత్ర పునరావృతం కాదని ఆశిస్తున్నా’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈయన ఈ విధంగా ట్వీట్ చేయడానికి గల కారణం ‘సెక్షన్-8’ అంశమే అని స్పష్టంగా అర్థమవుతోంది. హైదరాబాదులో సెక్షన్-8 అమలుపై రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు అటు కేంద్రప్రభుత్వంలో కూడా పెద్దఎత్తున చర్చలు జరుగున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పై విధంగా ట్వీట్ చేయడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ktr-tweet-narendra-modi

కేటీఆర్ చేసిన ఆ ట్వీట్ కు మోడీ స్పందన ఎలా వుంటుందో తెలీదు కానీ.. టీడీపీ నేతలు మాత్రం తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారని సమాచారం! సెక్షన్-8 ఖచ్చితంగా అమలవుతుందని.. తెలంగాణ ప్రభుత్వం ఎంత ఏడ్చి మొత్తుకున్నా ఫలితం దక్కదని వారంటున్నారు. సెక్షన్-8 అమలుకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అటు రాజకీయవర్గాల్లోనూ చెప్పుకుంటున్నారు. చివరికి ఈ సెక్షన్-8 పరిస్థితి ఏమవుతుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ktr  Narendra Modi  Twitter  Emergency  

Other Articles