Kabaddi Player Beaten Up Allegedly After She Complained Against Harassers | harrassment cases

Kabaddi player beaten up allegedly after she complained against harassers

sneha singh kabaddi, national level kabaddi player sneha singh, sneha singh crime news, sneha singh rape attempt case, sneha singh latest news, sneha singh teased, kabaddi player, harassement cases

Kabaddi Player Beaten Up Allegedly After She Complained Against Harassers : A national level Kabaddi player is severely wounded after being attacked allegedly after she complained against two men for harassing her.

జాతీయస్థాయి క్రీడాకారిణిపై అత్యాచారయత్నం

Posted: 06/25/2015 11:04 AM IST
Kabaddi player beaten up allegedly after she complained against harassers

ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోకపోవడమే లేక సమాజంలో స్వేచ్ఛ వుందనో తెలియదు కానీ.. మగమృగాళ్లు తమ పైశాచికత్వాన్ని మరింత ప్రదర్శించేస్తున్నారు. చిన్నాపెద్దా అని తేడాలేకుండా స్త్రీలపై రాక్షసమృగాళ్ల విరుచుకుపడుతున్నారు. ఇక విషయానికొస్తే.. కాన్పూర్ లో మదమెక్కిన ఇద్దరు వ్యక్తులు ఏకంగా జాతీయస్థాయి క్రీడాకారిణిపై అత్యాచారం చేసేందుకు యత్నించారు. అది కూడా రెండుసార్లు. మొదటిసారి ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆ మృగాళ్లు పారిపోయారు. తనపై జరిగిన దాడిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా..  తర్వాతిరోజు మరోసారి ఆ దుండగులు ఆమెపై దాడికి తెగబడ్డారు. ఎలాగోలా వారి బారినుంచి తప్పించుకున్న ఆమె.. జరిగిన ఉదంతంపై పోలీసులకు సమాచారం అందించింది. దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారిని స్నేహాసింగ్ (డాలీ)పై ఈనెల 15వ తేదీన ఆమె ఇంటి సమీపంలో వుండే ఉజాలా ఠాకూర్, గాంధీలు అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఆమె ప్రతిఘటించగా.. వారిద్దరూ పారిపోగా ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమె తనపై జరిగిన అత్యాచారయత్నం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకు ఆ దుండగులు.. ఆ తర్వాత రోజు ఆమెపై మళ్లీ దాడికి తెగబడ్డారు. ఆమెను లాఠీతో కొట్టడంతో స్నేహ ముక్కు విరగడంతోపాటు అక్కడక్కడ దెబ్బలు తగిలాయి. ఈ దాడిని అడ్డుకునేందుకు ఆమె కుటుంబసభ్యులు ప్రయత్నించగా.. వారికి గాయాలయ్యాయి. చివరికి స్నేహ, కుటుంబసభ్యులు మూకుమ్మడిగా దాడి చేయగా.. ఆ దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే.. జరిగిన ఈ సంఘటన గురించి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లగా.. వాళ్లు అంత సీరియస్ గా తీసుకోకుండా తేలికగా తీసుకున్నారని ఆమె ఆరోపించింది. ఏవో చిన్న సెక్షన్లతో కేసు నమోదు చేసినా.. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించలేదని ఆమె పేర్కొంది. దీంతో ఆమె మరో ముందడుగు వేసింది.

తనతో జరిగిన మొత్తం ఉదంతంపై స్నేహా మంగళవారం కాన్పూర్ ఎస్ఎస్పీ శలబ్ మాథూర్ ని కలిసి మరోసారి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన మాథూర్.. స్నేహాను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం వచ్చిన నివేదికలో స్నేహ స్వల్పగాయాలతో బాధపడుతోందని తేలగా.. వాటి ఆధారంగా సెక్షన్ 323. 504, 506, 325ల కింద కేసును నమోదు చేశారు. నిందులకోసం రెండో పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sneha singh  harassement cases  kabaddi player  

Other Articles