Modi, Emergency, Indira Gandhi, Twitter

Modi tweet about the emergency

Modi, Emergency, Indira Gandhi, Twitter

Modi tweet about the emergency. In the 1975 the Indira Gandhi govt called for emergency in india. Modi responds on the emergency situation in 1975.

ఎమర్జెన్సీపై మోదీ ఏమన్నారంటే..

Posted: 06/25/2015 11:26 AM IST
Modi tweet about the emergency

దేశం చరిత్రలో చీకటి కోణాలకు తెర తీసిన ఎమర్జెన్సీ విధించి సరిగ్గా నలభై ఏళ్లు కావస్తోంది. దేశ ప్రగతిని వెనక్కినెట్టి, దేశ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిన 1975నాటి ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ స్పందించారు. 40 ఏళ్ల క్రితం నాటి చీకటి ఉదంతంపై తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఎమర్జెన్సీ కాలంలో ఎంతో కష్టపడి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారి పట్ల మనం ఎంతో గర్వపడాలి అని మోదీ అన్నారు. నలభై ఏళ్ల క్రితం భారత ప్రజాస్వామ్యంపై రాజకీయ  అనిశ్చితి విజయం సాధించిందని అన్నారు. ఎమర్జెన్సీ ఎన్నో మంచి అవకాశాలను కల్పించిందని, ఒకరితో ఒకరు కలిసి పని చేసేలా ఎమర్జెన్సీ అవకాశాన్ని కల్పించిందని అన్నారు. ఎన్నో మరిచిపోలేని స్మృతులను ఎమర్జెన్సీ అందించిందని మోదీ తెలిపారు.

modi-latest-tweet-on-emerge

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Emergency  Indira Gandhi  Twitter  

Other Articles