parliament | Canteen | Subsidy | Govt | Prices

In that canteen tea for one rupee and mutton curry for twenty only

parliament, Canteen, Subsidy, Govt, Prices

In that canteen tea for one rupee and mutton curry for twenty only.mouth watering mutton curry for Rs 20, mutton cutlet for Rs 18, a crunchy masala dosa for Rs 6 and boiled vegetables for as little as Rs 5. The rates can make one salivate as much as the dishes.

రూపాయికి టీ.. ఇరవైకే మటన్ కర్రీ

Posted: 06/24/2015 11:43 AM IST
In that canteen tea for one rupee and mutton curry for twenty only

అక్కడ టీ తాగాలంటే జేబులో ఒకే ఒక్క రూపాయి ఉంటే చాలు కాలు మీద కాలేసుకొని దర్జాగా చాయ్ తాగొచ్చు. దోశ తినాలనుకుంటే నాలుగు రూపాయలు ఉంటే చాలు. ఒక రూపాయికే చపాతి, రెండు రూపాయలకు ప్లేట్ రైస్, ఇరవై రూపాయలకే మటన్ కర్రీ .. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం 70 ఐటమ్స్ కన్నా ఎక్కువే ఉంటాయి. అవును ఇంతకీ ఇంత చీప్ గా ఎక్కడ అమ్ముతున్నారని అనుకుంటున్నారా..? ఇది తమిళనాడులోని "అమ్మ కాంటీన్" లోని మెనూ అనుకొంటున్నారా ? చంద్రబాబు నాయుడు ప్రారంభించాలనుకున్న అన్న కాంటీన్ లోని రేట్లని అనుకుంటే పొరపాటే. సాక్ష్యాత్తూ మన దేశ "పార్లమెంట్ క్యాంటీన్" లోని ధరల పట్టిక ఇది.ఒక్క సారి పట్టిక చూడండి.
 టీ : రూ. 1/-
సూప్ : రూ. 5.50/-
దాల్ : రూ. 1.50/-
చపాతీ : రూ.1/-
ప్లేట్ రైస్ : రూ.2/-
దోసా : రూ. 4/-
ఖీర్ : రూ. 5.50/-
ఫ్రూట్ కేక్ : రూ. 9.50/-
ఫ్రూట్ సాలాడ్ : రూ. 7/-
వెజ్ పలావ్ : రూ. 8/-
టొమాటో రైస్ : రూ. 7/-
రాజ్మా రైస్ : రూ. 7/-
పెరుగన్నం : రూ. 11/-
శాకాహార భూజనం : రూ. 12.50/-
మాంసాహార భోజనం : రూ.22/-

parliament-canteen

ఇలా ఇంత తక్కువ ధరకు మంచి ఆహారాన్ని అందిస్తున్నందుకు వాళ్లు ఒరగబెట్టేదేంటో జనాలు అందరికి తెలుసు. అయితే ఇంతకీ ఇంత తక్కువ రేటుకు ఎలా వస్తున్నాయి. మామూలు వ్యక్తులకైతే బయట ధరలు మండిపోతున్నాయి కదా మరి అలాంటప్పుడు ఇంత తక్కువ ధరలో ఎలా అమ్మగలుగుతున్నారు..? ఇలా చాలా అనుమానాలు ఉంటాయి. కానీ వాటన్నింటికి ఒకటే సమాధానం. అవే ప్రభుత్వం వారి సబ్సిడి. అయితే సబ్సిడీ అంటే ఏదో పదో పరకో అనుకుంటే పొరబాటు. ఏకంగా అరవై కోట్ల రూపాయలు ఇలా పార్లమెంట్ క్యాంటీన్ కోసమే సబ్సిడీ కింద కేటాయించారంటే ఏ మాత్రం చిత్తశుద్ది ఉందో అర్థం చేసుకోవచ్చు. 2009-10కి గాను 10.4కోట్లు, 2010-11కు గాను 11.7కోట్లు, 2012-13కు గాను 11.9కోట్లు, 2013-14గాను 12.5 కోట్లు ఇలా మొత్తంగా 60 కోట్ల 7లక్షల రూపాయలు సబ్సిడీగా ఇచ్చారు. పార్లమెంట్ క్యాంటీన్ కు సంబందించిన వివరాలపై సమాచార హక్కు చట్టం కింద వచ్చిన పిటిషన్ పై ఇచ్చిన సమాచారంతో ఈ సబ్సిడీ వెలుగులోకి వచ్చింది. అయినా గ్యాస్ సబ్సిడీని ఎత్తివేస్తాం... రైతులకు ఇచ్చే విత్తనాల్లో సబ్సిడీని ఎత్తేస్తాం అనే ప్రభుత్వాలు ఇలా తమ వరకు మాత్రం ఎంత సబ్సిడీకైనా సిద్దంగా ఉంటాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parliament  Canteen  Subsidy  Govt  Prices  

Other Articles