HIgh court| Revanth Reddy | Bail | Petetion

High court postponed the hearing of bail petetion of revanth reddy

HIgh court, Revanth Reddy, Bail, Petetion, Telangana, Advocate general, Cash for vote

HIgh court postponed the hearing of bail petetion of Revanth reddy. Reventh reddy put a petetion for bail. The Telangana advocate general said that they need one week time.

రేవంత్ బెయిల్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా

Posted: 06/24/2015 11:30 AM IST
High court postponed the hearing of bail petetion of revanth reddy

ఓటుకు నోటు వ్యవహారంలో నిందితుడిగా అరెస్టయిన  తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై హైకోర్ట్ వాయిదా వేసింది. తనతో పాటుగా నిందితులుగా ఉన్న మరో ఇద్దరికి కూడా బెయిల్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణకు స్వీకరించింది. అయితే విచారణను ప్రాపంభించడానికి ముందే తెలంగాణ అడ్వకేట్ జనరల్ కేసులో తన వాదనను వినిపించేందుకు కొత్తగా మరింత సమాచారంసేకరించిన నేపథ్యంలో వారం రోజులు గడువు కావాలని కోరారు. ఓటుకు నోటు కేసులో తాజాగా మరింత సమాచారం అందిందని, దానికి సంబందించిన కౌంటర్ దాఖలు చెయ్యడానికి వారం రోజులు కావాలన్న తెలంగాణ అడ్వకేట్ జనరల్ వాదనపై హైకోర్ట్ న్యాయమూర్తి స్పందించారు. అయితే వారం రోజులు కాకుండా రెండు రోజుల గడువుతో బెయిల్ పిటిషన్ ను శుక్రవారానికి వాయిదా వేశారు. అయితే రేవంత్ రెడ్డి లాయర్ ఢిల్లీ నుండి వచ్చిన నేపధ్యంలో వారం రోజుల గడువుతో ఇబ్బంది పడాల్సి వస్తుందని రేవంత్ తరఫు లాయర్ న్యాయమూర్తి వినిపించారు. దాంతో న్యాయమూర్తి శుక్రవారం లోగా అన్ని పూర్తి చెయ్యాలని అడ్వకేట్ జనరల్ ను ఆదేశించారు.

ఇక మరో పక్క ఓటుకు నోటు కేసులో తన పేరును తొలగించాలని జెరూసలెం మత్తయ్య పిటిషన్ పై కూడా ఇవాలే కీలక తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఓటుకు నోటు కేసులో నిందితుడికి ఏపి అడ్వకేట్ జనరల్ వాదించడంపై కోర్టు ఆవరణలో చర్చసాగుతోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం తరఫున దీనిపై అభ్యంతరం వ్యక్తం చెయ్యాలని చూస్తున్నట్లు సమాచారం. ఓటుకు నోటు కేసులో తన ప్రమేయం లేదని, స్టీఫెన్ సన్ కూడా తన పేరును ప్రస్తావించలేదని జెరూసలెంమత్తయ్య తన పిటిషన్ లో పేర్కొన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : HIgh court  Revanth Reddy  Bail  Petetion  Telangana  Advocate general  Cash for vote  

Other Articles