Death by Selfie:Engineer Student Dies During Taking Selfie in Rajahmundry Railway Station

Engineer student dies during taking selfie

Engineer Student dies during taking Selfie, Rajahmundry Railway Station, Engineer Student dead while taking Selfie, santhosh kumar, Andhra Student, Engineer Student dies during taking Selfie in Rajahmundry Railway Station, selfies killing youth, youth dies while taking selfie, selfies, railway hi tension wires

An Andhra Student admitted in ICU of a Hospital now and fighting for his life. btech student Santhosh Kumar a native of Visakhapatnam, climbed atop a train to take a selfie.

ITEMVIDEOS: సెల్పీల వ్యామోహం.. ప్రాణాలను హరిస్తుంది

Posted: 06/24/2015 01:33 PM IST
Engineer student dies during taking selfie

సామాజిక మాధ్యమాలు తెరపైకి వచ్చిన వేళా విశేషం ఏమిటో కాని.. ప్రపంచ వ్యాప్తంగా అనేక నిండు ప్రాణాలు బలి అవుతున్నాయి. సెల్పీలు దిగటం, వాటిలో ఫోస్టు చేయడం.. ఎన్ని లైకులు వస్తాయి. ఎవరెవరు ఎలా కామెంట్ చేస్తారో చూడటం.. వాటితో ఆనందం పోందడం యువతకు ఫ్యాషన్ గా మారిపోయింది. అయితే ఆ వ్యామోహం ప్రాణాలు తీస్తోంది! కొత్తగా.. సరికొత్తగా సెల్ఫీలు తీసుకోవాలనే ఉబలాటం ప్రాణాలను ఊదేస్తోంది. తాజాగా సెల్ఫీ కోసం ఏదైనా కొత్తగా చేయాలనుకున్న ఓ యువకుడు రైలు ఇంజన్‌పైకి ఎక్కడంతో పైన ఉన్న హైటెన్షన్‌ వైర్లు తగిలి కరెంట్‌ షాక్‌ కొట్టి కింద పడిపోయాడు! ఇప్పుడు మృత్యువుతో పోరాడుతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే..విశాఖపట్నానికి చెందిన కనుమూరి సంతో్‌షవర్మ (20) స్నేహితులతో కలిసి మరో స్నేహితుడి సోదరి వివాహానికి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి వచ్చాడు. వారంతా సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ నుంచి దిగారు. సంతోష్‌ వర్మ.. 8వ అవుటర్‌ లైన్‌పై నిలిపి ఉన్న రైలు ఇంజన్‌పైకి ఎక్కి సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. అనుకున్నట్టే రైలింజన్‌పైకి ఎక్కాడు.. కానీ, పైన ఉన్న హైటెన్షన్‌ విద్యు త్‌ తీగలను గమనించలేదు. దీంతో ఆ వైర్లు అతడికి తగిలి కరెంట్‌ షాక్‌ కొట్టి... కింద పడిపోయాడు. 60 శాతం కాలిన గాయాలైన సంతో్‌షను స్నేహితులు రాజమండ్రిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. 48 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్ప లేమని వైద్యులు చెప్పారు. అయితే స్థానికుల కథనం ప్రకారం.. రైలు ఇంజన్‌పై నిలబడి సెల్ఫీ తీస్తుండగా కెమెరా ఫ్లాష్‌ వల్ల విద్యుత్‌ సరఫరా జరిగి ఇంజన్‌పై కిందపడ్డాడని చెబుతున్నారు. సెల్‌ఫోన్‌ కూడా కాలిపోయింది. రైల్వే పోలీసులుబాధితుని వివరాలు సేకరించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Engineer Student  selfie  Rajahmundry Railway Station  santosh kumar  

Other Articles