Traffic police manhandled by mob in visakha

Man attacked traffic police in visakhapatnam

Man attacked traffic police in visakhapatnam, Traffic police manhandled by mob in visakha, man, sisters, relatives, attack, traffic police, drunk and drive case, visakhapatnam, bheemili police, police,

man along with his sisters and relatives attacked traffic police after being booked in drunk and drive case in visakhapatnam at bheemili

ITEMVIDEOS: తాగి వాహనం నడిపింది కాక.. పోలీసులపైనే దాడి

Posted: 06/23/2015 06:47 PM IST
Man attacked traffic police in visakhapatnam

మొన్న ఉత్తర్ ప్రదేశ్, నిన్న ఒడిషాలో ఇవాళ ఆంధ్రప్రదేశ్..  రక్షణ కల్పించాల్సిన పోలీసులే రక్షణ కరువై హెల్ప్ హెల్ప్ అంటూ ఆర్థనాథాలు పెట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. తమ ఇష్టం వచ్చినట్టు చేసుకునే ప్రజల.. అవరసరార్థం.. అనునిత్యం శ్రమించే పోలీసుల.. వారి ఆయురారోగ్యాలను పధిలంగా వుంచేందుకు తీసుకోచ్చిన చట్టాన్ని తమపై రుద్దితే ఊరుకునేది లేదని ఏకంగా తెగేసి చెప్పడమే కాదు.. పోలీసులతో సై అంటే సై అంటూ ఇబ్బందులు పెడుతున్నారు. అదే డ్రంక్ అండ్ డ్రైవ్ చట్టం.

డ్రంకెన్ డ్రైవ్ కేసులో అడ్డంగా దోరికిన నిందితులు... నడి రోడ్డుపై పోలీసులతో చిన్నపాటి యుద్దమే చేశారు. వందల మంది స్థానికుల మద్దతుతో ఓ కుటుంభం ఒకవైపు ఓ నలుగురు పోలీసులు ఒక వైపు. తప్పదన్నట్లు వెనుదిరిగిన రక్షక భటులు కేసులు నమోదు చేసి తమ సత్తా చాటేందుకు రడీ అవుతున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందనుకుంటున్నారా..?  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం...విషాఖపట్నం జిల్లా.... తగరపువలస అనే ఓ పెద్ద ఊరు. రవి అనే యువకుడు బైక్ మీద వస్తుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తోన్న ట్రాఫిక్ ఎస్సై జోగా రావు అతన్నిచెక్ చేశాడు.

రవి మద్యం సేవించినట్టు తేలిందని, మరుసటి రోజు కోర్టులో ఫైన్ చెల్లించమని తాము చెప్పి అతన్ని పంపించామని ఎస్సై జోగారావు అన్నారు. కానీ తన వద్ద రెండువేల రూపాయలు లాక్కొని తనను కొట్టారని రవి ఆరోపిస్తున్నారు. రవి వాదనను నమ్మిన అతని కుటుంభ సభ్యులు కొందరు స్థానికులతో కలిసి పోలీసుల దగ్గరికి వచ్చారు. ఇక గొడవ మొదలైంది. దాంతో పోలీసులు రవిని తమ రక్షక్ వాహనంలో తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. అంతే రవి సోదరి ఆదిలక్ష్మి ఆవేశంతో ఊగి పోయింది. వాహన బైనెట్ మీదకెక్కి కూర్చుంది. రవి బందువులు స్థానికులు కలిసి ఎస్సై మీద దాడి చేశారు. దాదాపు గంటపాటు అటు రవి మద్దతుదారులు ఇటు పోలీసులు తోసుకోవడం అరుపులు కేకలతో తగరపు వలస రోడ్డుపై ట్రాఫిక్ మొత్తం స్తంభించింది. రంగంలోకి దిగిన లా అండ్ ఆర్డర్ పోలీసులు రవి అతని కుటుంభ సభ్యులు సహా సహకరించిన స్థానికులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  Drunk and Drive  Visakapatnam  Attack  

Other Articles