Police Kill Pakistani Teen Taking Selfies With Toy Gun: Report

Police shot dead pakistani teen taking selfies

police shot dead pakistani teen taking selfies, teenager taking selfies shot dead, teenager taking selfies with a toy gun killed, selfie, Pakistan, toy gun, Faisalabad, Pakistan's Punjab province, Farhan, robber, criminal, opened fire

A teenager taking selfies with a toy gun was shot dead by police personnel who suspected him to be a robber in Pakistan's Punjab province, media reported on Tuesday.

ప్రాణం తీసిన సెల్పీ.. పోలీసు తూటాలకు బలి

Posted: 06/23/2015 06:59 PM IST
Police shot dead pakistani teen taking selfies

సెల్పీలు దిగడం.. వాటని సామాజిక మాద్యమంలో పోస్టు చేయడం.. ఎన్ని లైక్ లు వస్తాయో. నంటూ ఆశగా ఎదురుచూడటం.. ఈ కాలం యువతకు ఒక విధిగా మారింది. ఏక్కడికైనా వెళ్తే.. గణ,ద్రవ పధార్థాలైనా వదిలేస్తారేమోగాని, సెల్సీలను దిగటం మాత్రం వదలరు. అలాంటి సెల్సీల కోసం ఓ యువకుడు చేసిన పని శృతిమించడంతో అసువులు బాశాడు. సెల్పీ దిగినందుకు పోలీసులు.. ఆ యువకుడిని కాల్చి చంపారు. అదేంటి ఏదైనా నిషేధ ప్రాంతంలో అతను సెల్పీలు దిగాడా అంటే.. అది కాదు..? మరెందుకు ఆ యువకుడని పోలీసులు కాల్చి చంపారు. వివరాల్లోకి వెళ్లే. పాకిస్థాన్ అక్రమిత పంజాబ్ ప్రావిన్స్ లోని ఫైసలాబాద్ నగరంలో పర్హాన్ అనే యువకుడు బొమ్మ తుపాకీతో సెల్పీకి ఫోజులిచ్చాడు.

అయితే అక్కడికి చేరుకున్న పోలీసలు పర్హాన్ చేతిలో గన్ వుండటంతో అతడిని దోంగగా భావించి.. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులతో పర్హాన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పర్హన్ వద్ద నున్నది బోమ్మ తుపాకీ అని తెలుసుకుని తప్పుచేశామని నాలుక కర్చుకున్నారు. కాగా, ఫర్హాన్ స్నేహితుడు అక్కడి నుంచి ప్రాణాలతో తప్పించుకుని పర్హాన్ తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. పర్హాన్ అప్పటికే అసువులు బాశాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు కాల్పలకు జరిపిన పోలీసును సస్పెండ్ చేయడంతో పాటు అతడిని అరెస్టు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : selfie  Pakistan  toy gun  Faisalabad  

Other Articles