KCR | Naayinia Narasimha Reddy | Cash for vote

Telangana home minister naayini narasimha reddy clear that telangana govt dont take back step on cash for vote case

KCR, Naayinia Narasimha Reddy, Cash for vote, Chandrababu naidu, Tapping

Telangana Home minister Naayini narasimha Reddy clear that Telangana govt dont take back step on cash for vote case. And also he said that we wont leave anybody in this case.

తగ్గలేదు.. తగ్గము కూడా అంటున్న నాయిని

Posted: 06/22/2015 04:11 PM IST
Telangana home minister naayini narasimha reddy clear that telangana govt dont take back step on cash for vote case

ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలు తారా స్థాయికి చేరిన విషయం అందరికి తెలుసు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల మధ్య జరిగిన మాటల యుద్దం గురించి కూడా ఢిల్లీ దాకా వినిపిస్తోంది. అయితే ఓటుకు నోటు వ్యవహారం తర్వాత తెలంగాణ సర్కార్ తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపిస్తు కేంద్రానికి నివేదిక కూడా ఇచ్చారు. అయితే అంతకంతకు పెరిగిన వివాదం చివరకు చంద్రబాబు నాయుడుకు నోటీసులు వస్తాయి అనే దాకా వెళ్లింది. అయితే అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు చంద్రబాబు నాయుడుకు నోటీసులు వస్తున్నాయహో అంటూ తెలుగు  న్యూస్ చానల్స్ బాగా ఊదరగొట్టాయి. కానీ అంతనుకున్నా ఏమీ జరగలేదు. అయితే తాజాగా తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మొత్తం వ్యవహారంపై వివరణ ఇచ్చారు.

ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ సర్కార్ మంచి దూకుడుగా వ్యవహరించింది. కానీ ఏపి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వివాదాన్ని తెర మీదకు తీసుకురావడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. తాజాగా తెలంగాణ సర్కార్ కాస్త తగ్గితే ఏపి సర్కార్ మాత్రం ట్యాపింగ్ పై దూకుడు పెంచింది. అయితే ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ సర్కార్ రాజీకి వచ్చిందని అందుకే చంద్రబాబు మీద చ్యలకు భయపడుతోందని పుకారు షికారు చేస్తోంది అయితే దీనిపై తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి వివరణ ఇచ్చారు. తెలంగాణ సర్కార్ రాజీ కుదుర్చుకుంది అన్న వార్తల్లో వాస్తవం లేదని నాయిని అన్నారు. కేసులో రాజీ పడే ప్రసక్తేలేదని, ఎంతటి వారున్నా వదిలిపెట్టమని కూడా నాయిని స్పష్టం చేశారు. మరి తెలంగాణ సర్కార్ ఎంత వరకు దూకుడు పెంచుతుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Naayinia Narasimha Reddy  Cash for vote  Chandrababu naidu  Tapping  

Other Articles