Balakrishna, Chandrababu, TDP, CM, ap

Hindupur mla cinema actor balakrishna respond on the chances to getting cm chair in ap

Balakrishna, Chandrababu, TDP, CM, ap

Hindupur Mla cinema actor Balakrishna Respond on the chances to getting cm chair in ap. balakrishna condemn the gossips to become ap cm.

సిఎం పదవి గురించి క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

Posted: 06/22/2015 03:31 PM IST
Hindupur mla cinema actor balakrishna respond on the chances to getting cm chair in ap

తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న ఓటుకు నోటు వ్యవహారంలో ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కు నోటీసులు అందుతాయని.. సిఎం పదవికి రాజీనామా చెయ్యాల్సి వస్తుందని పుకారు షికారు చేస్తోంది. ఒకవేళ అలా చంద్రబాబు నాయుడు గనక రాజీనామా చేస్తే నందమూరి బాలకృష్ఱ ఏపికి సిఎం అవుతారని రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. అయితే షబ్బీల్ అలీ లాంటి నేతలు దానికి మద్దతు కూడా ఇస్తున్నారు. బాలకృష్ణ టైం చాలా బాగుందని.. తొందరలోనే సిఎం అవుతారని తెలంగాణ మంత్రి, మాజీ టిడిపి నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అయితే దీనిపై మొత్తానికి నందమూరి బాలకృష్ణ స్పందించారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో మాట్లాడుతూ బాలకృష్ణ తనకు సిఎం అయ్యే అవకాశం ఉందన్న దానిపై స్పందించారు.

 తాను ముఖ్యమంత్రి అవుతానని వచ్చిన వార్తలను సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఖండించారు. ప్రభుత్వాన్ని పార్టీని చంద్రబాబే సమర్థవంతంగా నిర్వహించగలరని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు సీఎం పదవికి రాజీనామా చేస్తారని, ఆయన రాజీనామా చేస్తే ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారన్న రకరకాల ఊహాగానాలు ప్రచారంలోఉన్నాయి. సీఎంగా అశోక్‌గజపతిరాజు, బాలకృష్ణ, లోకేష్‌ నాయుడు పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బసవతారకం కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆ సంస్థ ఛైర్మన్‌ బాలకృష్ణ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తామని అన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో కేన్సర్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని బాలయ్య తెలిపారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Chandrababu  TDP  CM  ap  

Other Articles