TCongress | suspend | jayasudha | TRS | kcr

Jayasudha likely to change the party from congress to trs

TCongress, suspend, jayasudha, TRS, kcr

Jayasudha likely to change the party from congress to TRS. A hot gossip goes viral . Jayasudha Invited Telangana cm KCR on her sons cinema audio function.

జయసుధ ఆ పార్టీ నుండి ఈ పార్టీ జంపా.?

Posted: 06/22/2015 04:25 PM IST
Jayasudha likely to change the party from congress to trs

సహజనటి,మాజి ఎమ్మెల్యే జయసుధపై  వేటు పడే అవకాశం ఉంది.గత కొంత కాలం నుంచి కాంగ్రెస్‌కి సంభందించిన ఏ కార్యక్రమాలలో పాల్గొనట్లేదు జయసుధ.అంతేకాదు టీఆర్ఏస్‌ చేరుతున్నట్లు ఊహగానాలు చక్కెర్లు కొడుతున్నాయి.ఈ వార్తలకు ఊతం ఇస్తూ..జయసుధ కుమారుడి మొదటి సినిమా సిఎం కేసీఆర్‌ చేతుల మీద జరగడం.ఆడియో ఫంక్షన్‌కు పిలవగానే సిఎం వెళ్లారంటే...ఈ వార్త నిజమే అయిఉంటుందని అంటున్నారు కాంగ్రెస్‌ పెద్దలు.అందుకే జయసుధ  రాజీనామా ఇవ్వక ముందే మనమే సస్పెండ్‌ చేస్తే పరువైనా మిగులుతుందని అనుకుంటున్నారంట టీకాంగ్రెస్‌ ప్రముఖులు.

కాని జయసుధ మాత్రం తనే ఉత్తమ్‌కుమార్‌ని,నియోజికవర్గ ఇంచార్జ్‌ పదవినుంచి తప్పించమని కొరానని చెప్పారు.అంతేకాక ఇప్పటిదాకా టీఆర్‌ఏస్‌ నుంచి ఎటువంటి ఆహ్వానం అందలేదని....ఒకవేళ అలాంటి అహ్వానం అందితే ఆలోచిస్తానని జయసుధ అన్నారు. అయినా ఆహ్వానం అందితే ఆలోచిస్తాను అని అన్నారంటే అన్నింటికి సిద్దమనే కదా అర్థం అలాంటప్పుడు ఇక పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చెయ్యకూడదని కాంగ్రెస్ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నారట. మరి అంతంత మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి .జయసుధ లాంటి నేతలు పోతే రానున్న గ్రేటర్ హైదరాబాద్ లో ఎలా విజయం సాధిస్తామని కూడా కాంగ్రెస్ వర్గాలు ఆలోచనలో పడినట్లు సమాచారం. మరి కాంగ్రెస్ పార్టీ జయసుధను సస్పెండ్ చేస్తుందో లేదా చూడాలి. మరి టీఆర్ఎస్ పార్టీ జయసుధను పార్టీలోకి ఆహ్వానిస్తుందో లేదో.?

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TCongress  suspend  jayasudha  TRS  kcr  

Other Articles