International Yoga Day | CM Chandrababu addresses Yoga Day event | Vijayawada

Andhra cm ministers perform yoga in vijayawada

International Yoga Day, Yoga day, CM Chandrababu, AP CM, Yoga Day celebrations, Yoga day Yoga Day Celebrations in AP, Yoga Day celebrations in India, Yoga day celebrations at rajpath, yoga day celbrations at raj bhavan, president pranab mukharjee, PM modi, narendra modi, chandra babu, First International Yoga Day celebrations, pandit ravi shanker, 199 countries celebrations, 44 islamic states, yoga asanaas, yoga

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu on Sunday participated in a yoga programme to mark world yoga day and announced a Rs.25 crore special fund for its promotion.

ITEMVIDEOS: యోగా కోసం రూ.25 కోట్ల ప్రత్యేక నిధులు.. ఏపీ సీఎం ప్రకటన

Posted: 06/21/2015 01:19 PM IST
Andhra cm ministers perform yoga in vijayawada

ప్రపంచ యోగా దినోత్సవం ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ నగరం ప్రధాన వేదికగా జరిగింది. నగరంలోని ఎ.కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన యోగా ఉత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికార, అనధికార ప్రముఖులు, యువతీ యువకులు పాల్గొని యోగా చేశారు. ముందుగా ప్రార్థనతో యోగా దినోత్సవం ప్రారంభమైంది. ధ్యానం తదితర యోగ ప్రక్రియలతో నిర్వాహకులు అందరితోనూ ఆసనాలు వేయించారు. అందరూ సులభంగా వేయగలిగే శశాంకాసనం, భుజంగాసనం, మకరాసనం, శవాసనం తదితర ఆసనాలు చేయించారు. ప్రాణాయామం, భ్రామరీ ప్రాణాయామం, ధ్యానం చేయించి వాటి వలన కలిగే శారీరక, మానసిక ప్రయోజనాలను తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యోగా వెలుగులు పూయించడానికి, యోగా అధ్యాపకులను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా రూ.25 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. యోగాను ఆరోగ్యశాఖలో భాగంగా తీసుకుని అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో జరిగిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వయంగా యోగాసనాలు వేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ మన పూర్వీకులిచ్చిన వారసత్వ సంపద యోగా, ధ్యానం అన్నారు.

ఈ సంపదను ప్రపంచానికి అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢ సంకల్పంతో ఉన్నారంటూ, నాడు ఆ నరేంద్రుడు (స్వామి వివేకానంద) మన దేశ ఔన్నత్యాన్ని, ప్రాభవాన్ని ప్రపంచానికి చాటి చెబితే, నేడు ఈ నరేంద్రుడు (ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ) మన అపూర్వ సంపదను ప్రపంచానికి అందిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. నేడు మొత్తం ప్రపంచం ఒక మహా సంకల్పానికి శ్రీకారం చుట్టిందని, ఒక వ్యక్తి అనుకుంటే ఏదైనా సాధించగలమని ప్రధాని నరేంద్ర మోదీ నిరూపించారని చంద్రబాబు అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : International Yoga Day  Chandrababu  Vijayawada  

Other Articles