Chandrababunaidu | cash for vote case | step | telangana

Ap cm and tdp president doing repeatedly mistakes on cash for vote case

Chandrababunaidu, cash for vote case, step, telangana, Revanth Reddy, TDP

ap cm and TDP president doing repeatedly mistakes on cash for vote case. Chandrababu naidu took wrong steps in the cash for vote case.

చంద్రబాబు నాయుడు తప్పులు ఇవే..

Posted: 06/17/2015 04:14 PM IST
Ap cm and tdp president doing repeatedly mistakes on cash for vote case

ఏపి సిఎం, తెలుగుదేశం పార్టీ అధినేత, దేశ, రాష్ట్ర రాజకీయాల్లో బాగా తలపండిన నేతగా పేరుతెచ్చుకున్న నారా చంద్రబాబు నాయుడు టైం అస్సలు బాగోలేదు. గత రెండు వారాలుగా సాగుతున్న ఓటుకు నోటు వ్యవహారం చంద్రబాబు నాయుడును, ఏపి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం వేగంగా కేసులో ముందుకు కదులుతుంటే, ఏపి సర్కార్ కు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అయితే రెండు వారాల నుండి కేసు సాగుతున్నా... చిరవకు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు కూడా ఉచ్చు బిగుస్తోందని గ్రహించి చంద్రబాబు నాయుడు అండ్ కొ చకచకా పావులు కదుపుతున్నారు. అయితే ఎంత రాజకీయ చాణిక్యుడే అయినా చంద్రబాబు నాయుడు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు.

చంద్రబాబు చేసిన తప్పులు..
* తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటుతో తెలుగుదేశానికి, చంద్రబాబుకు ఒరిగిందేమీ లేదు. కాబట్టి దూరంగా ఉండాల్సింది.
* రేవంత్ రెడ్డి కీలక నేతను కాకుండా ఓలాంటి పాపులారిటీ లేని వ్యక్తులను ఇందులో వాడాల్సింది
* స్టీఫన్ సన్ తో నేరుగా ఫోన్లో మాట్లాడటం, అతని అడ్డాలో కలవడం లాంటివి చెయ్యకుండా ఉండాల్సింది
* రేవంత్ రెడ్డి అరెస్టు అయిన వెంటనే స్పందించాల్సింది.
* ఓటుకు నోటు వ్యవహారంలో తమ ఆడియో టేపులు బయటకు వచ్చే దాకా తెలంగాణ సర్కార్ కు అవకాశం ఇవ్వాల్సింది కాదు
* ఆడియోలో ఉన్నది తన వాయిస్ కాదు అని చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ప్రకటించలేదు.
* ట్యాపింగ్ విషయం తన ఆడియో టేపుల విడుదల తర్వాతే ఎందుకు తెర మీదకు వచ్చిందో జనాలకు చెప్పాల్సింది
* ట్యాపింగ్ ఆరోపణల్లో ఇప్పటి వరకు మీడియాకు ఒక్క సాక్షాన్ని కూడా విడుదల చెయ్యలేదు.
* తన సెక్యూరిటీలో తెలంగాణ పోలీసులపై పరిమితులు పెట్టకుండా ఉండాల్సింది.
* ఆడియో టేపుల్లో తన వాయిస్ లేదు అని నిరూపించుకోవాల్సింది.

//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababunaidu  cash for vote case  step  telangana  Revanth Reddy  TDP  

Other Articles