crisis | telugu state politics | tapping | chandrababu | cash for vote

Telugu states facing crisis issue by tapping and cash for vote alligations

crisis, telugu state politics, , tapping, chandrababu, cash for vote, telangana, ap,

Telugu states facing crisis issue by tapping and cash for vote alligations. Telangana and ap state fighting got peaks.

ప్రగతి పక్కకు.. వివాదాలు ముందుకు

Posted: 06/17/2015 03:31 PM IST
Telugu states facing crisis issue by tapping and cash for vote alligations

గత పదిహేను రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలుగు రాష్ట్రాల ప్రగతిని దిగజార్చుతున్నాయి. ఓటుకు నోటు వ్యవహారం అంటూ ఓ రాష్ట్రం, ట్యాపింగ్ వ్యవహారం అంటూ మరోరాష్ట్రం కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. తెలుగు రాష్ట్ర రాజకీయాలు సంక్షోభంగా మారుతున్నాయి. ఏపీ సిఎం ఎలక్షన్‌ కోడ్ వాదన వినిపిస్తుంటే, టీ సర్కార్‌ మాత్రం ముందుకు పోతోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే రీతిలో వ్యవహరిస్తోంది  టీ ప్రభుత్వం. అటు చంద్రబాబు మాత్రం ఉమ్మడి రాజధానిలో ఫోన్‌లు ఎలా టాప్‌ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎలక్షన్‌ కోడ్ అమల్లో ఉండగా ఏ వ్యవహారమైనా ఎలక్షన్‌ కమీషన్‌ పరిధిలోకి వస్తోందని చంద్రబాబు వాదన.

అయితే ఇదే సందర్భంలో తప్పుడు పనులు చేస్తే ఎలక్షన్‌ కోడ్ ఒప్పుకుంటుందా అని టీ ఎంపీ వినోద్ ప్రశ్నించారు. ఏపీ సిఎంకు నోటీసులు ఇచ్చేందుకు టీ ఏసీబీ సిద్దమౌతున్నట్లు సమాచారం. ఒకవేళ నోటీసులు ఇస్తే చంద్రబాబు ఈ నోటీసులకు ఎలా స్సందిస్తారనేది చర్చనీయాంశంగా మారంది. ఫోన్‌ టాప్‌ చేసే అధికారం టీ సర్కార్‌కు, నోటీసులు ఇచ్చే అధికారం టీ ఏసీబీకి లేదని ఆయన మొదటి నుంచి చెబుతున్నారు. ఈ నేపధ్యంలో చట్టపరమైన ఏసీబీ ఇచ్చే నోటీసులను చంద్రబాబు స్వీకరిస్తారో లేదో అనేది ఇంట్రస్టింగ్ గా మారింది. ఒకవేళ నోటీసులకు చంద్రబాబు స్పందించకపోతే ఏం జరగనుందనేది అందరి దృష్టి ఉంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : crisis  telugu state politics  tapping  chandrababu  cash for vote  telangana  ap  

Other Articles