Internet | Wifi | ap | Fiber grid | Chandrababu

Ap govt decided to provide free wifi in every village by fiber grid

Internet, Wifi, ap, Fiber grid, Chandrababu, cabinet, Fiber

AP govt decided to provide free wifi in every village by fiber grid. The fiber grid will avail by 2018. The every household get internet by paying 200ru[pees with 10mbps speed.

ప్రతి ఊర్లో గంటపాటు ఫ్రీ వైఫై సేవలు

Posted: 06/15/2015 04:37 PM IST
Ap govt decided to provide free wifi in every village by fiber grid

ఏపి ప్రభుత్వం డిజిటల్ రంగంలో కొత్త పుంతలు తొక్కడానికి సిద్దపడుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని పలు ప్రదేశాల్లో ఫ్రీ వైఫై సర్వీసులను అందుబాటులో ఉంచింది. అయితే ఏపి ప్రభుత్వం కూడా ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని చేరువ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా ఫైబర్ గ్రిడ్  ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ కల్పించాలని ఏపి ప్రభుత్వం నిర్ఱయించింది. తాజాగా ఏపి మంత్రి మండలి భేటిలో ఫైబర్ గ్రిడ్ పై నిర్ణయం తీసుకున్నారు. అసలే హైటెక్ బాబుగా పేరున్న చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కేబినెట్ ఫైబర్ గ్రిడ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి కేవలం రెండు వందల రూపాయలతోనే 10 ఎంబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. ప్రతి గ్రామంలోనూ ఒక గంటపాటు ఫ్రీగా వైఫై సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే 2018 నాటి్కి విడతల వారిగా ఫైబర్ గ్రిడ్ ను ఏర్పాటు చెయ్యాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. కొండలు, గిరిజన ప్రాంతాల్లో శాటిలైట్ ల ద్వారా బ్రాడ్ బ్యాండ్ కు ప్రత్యేక ప్రాజెక్టును ఏర్పాటు చెయ్యాలని కూడా ఏపి మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Internet  Wifi  ap  Fiber grid  Chandrababu  cabinet  Fiber  

Other Articles