Tamila munnetra padai, Shobhan babu, Statue, chennai

Tamila munnetra padai warn to dismandal the statue of teluigu actor shobhanbabu in chennai

Tamila munnetra padai, Shobhan babu, Statue, chennai

Tamila munnetra padai warn to dismandal the statue of teluigu actor shobhanbabu in Chennai. The Tamilnadu police provide special protection at shobhababu house.

ITEMVIDEOS: శోభన్ బాబు విగ్రహంపై చెన్నైలో రచ్చ

Posted: 06/15/2015 04:00 PM IST
Tamila munnetra padai warn to dismandal the statue of teluigu actor shobhanbabu in chennai

ప్రముఖ నటుడు, దివంగత సినీ నటుడు శోభన్ బాబు విగ్రహంపై తమిళనాట వివాదం సాగుతోంది. శోభన్ బాబు విగ్రహాన్ని తొలగిస్తున్నామని వచ్చిన ఓ ప్రకటన, చేసిన హడావిడి శోభన్ బాబు అభిమానులు, కుటుంబ సభ్యులకు కలవరిపరిచింది.విజయలక్ష్మి సంఘం, తమిళ మునేట్ర పడై అనే సంస్థలు శోభన్ బాబు విగ్రహాన్ని కూలుస్తున్నట్లు ప్రకటించాయి. అయితే అంతకు ముందు నాగపట్నం జిల్లా వేలాంగిని సమీపంలోని  దక్షిణ పోయెగై నళ్లూర్ లో తమిళ మునేట్ర పడై అనే సంస్థ నిషేదిత ఉగ్రవాది ప్రభాకరన్ విగ్రహం ఏర్పాటు చేసింది. అయితే తమిళనాట పోరాట యోధుడి విగ్రహాన్ని తొలగించినప్పుడు శోభన్ బాబు విగ్రహాన్ని తొలగిస్తామని కూడా హెచ్చరించింది. రాష్ట్రానికి చెందిన విగ్రహాలు కాకుండా మిగిలిన వారి విగ్రహాలను ఎలా ఉంచుతారని వారు ప్రశ్నించారు. అయితే దీనిపై శోభన్ బాబు అభిమానులు, కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. తాము తమ స్వంత స్థలంలో, స్వంత డబ్బులతో కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని కూడా వారు హెచ్చరిస్తున్నారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి భ్రదతా ఏర్పాట్లు చేసింది. శోభన్ బాబు ఇంటి వద్ద ప్రత్యేక బలగాలను మోహరించించింది తమిళనాడు ప్రభుత్వం. ఇప్పటికే 18 మంది కమిటి కార్యకర్తలను అరెస్టు చేశారు. అయితే ఏదైనా వివాదం ఉంటే ప్రభుత్వంతో చర్చించాలని.. లేని పక్షంలో కోర్టుకు వెళ్లాలని తప్పితే విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పడం తగదని శోభన్ బాబు కుటుంబ సభ్యులు అంటున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamila munnetra padai  Shobhan babu  Statue  chennai  

Other Articles