supreme court directs cbse to re-conduct all india pre medical test 2015 within four weeks

Sc directs cbse to re conduct aipmt exam in four weeks

All India Pre Medical Test, Central Board Of Secondary Education (School District), Chemistry (Field Of Study), India (Country), Test (assessment), CBSE, re-conduct AIPMT exam, four weeks,big achievement for the students, parents expressed joy over SC’s verdict, supreme court, re-conduct, AIPMT

The Supreme Court on Monday set aside the All India Pre Medical Test (AIPMT) entrance exam and directed the Central Board of Secondary Education (CBSE) to re-conduct the exam in four weeks

ITEMVIDEOS: ఆ పరీక్షలు చెల్లవు.. 4 వారాల్లో మళ్లీ నిర్వహించండీ.

Posted: 06/15/2015 07:02 PM IST
Sc directs cbse to re conduct aipmt exam in four weeks

కేంద్రీయ ఉన్నత విద్యా బోర్డు (సీబీఎస్ఈ)కు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. వైద్య (ఎంబీబీఎస్) కోర్సుల్లో ప్రవేశాలకు సీబిఎస్ఈ గతంలో నిర్వహించిన ఆల్ ఇండియా ప్రి మెడికల్ టెస్టు చెల్లదని, మరోమారు నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం సంబంధిత అధికారులను అదేశించింది. గతంలో నిర్వహించిన ఆల్ ఇండియా ప్రి మెడికల్ టెస్టు ప్రశ్నా పత్రాలు లీకైన నేపథ్యంలో అది చెల్లదని స్పష్టం చేసింది. నాలుగువారాల్లోగా కొత్తగా పరీక్ష నిర్వహించే ఏర్పాట్లు చేయాలని కూడా సీబీఎస్ఈని ఆదేశించింది.

పరీక్ష కేంద్రాల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ప్రశ్నా పత్రాల లీకేజీ సమస్య ఏర్పడుతుందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారైనా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించింది. అంతకుముందు మరోసారి పరీక్షకు ఏర్పాట్లు చేస్తే జాప్యం అవుతుందని, విద్యార్థులు నష్టపోతారని సీబీఎస్ఈ దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. ప్రశ్నాపత్రాలు లీక్ అవలేదని సీబీఎస్ఈ చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. మొత్తం 6.3 లక్షల మందికి ఇప్పటికే ఓసారి పరీక్ష నిర్వహించింది. ప్రశ్నాపత్రాలు లీకవడంతో కొందరు కోర్టుకు వెళ్లగా జూన్ 5న వెలువరించాల్సిన ఫలితాలు ఆగిపోయాయి.

*జి.మనోహర్*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : all India pre medical test  supreme court  re-conduct  AIPMT  

Other Articles