revanth reddy | Tdp | telangana | money for vote

Telugu people are very interesting in cash for vote case

revanth reddy, Tdp, telangana, money for vote

Telugu people are very interesting in cash for vote case. cash for vote case, Revanth Reddy arrested by acb, after that what will acb do.

ఓటుకు నోటు కేసులో ఏంజరగబోతోంది...

Posted: 06/15/2015 08:02 AM IST
Telugu people are very interesting in cash for vote case

తెలుగు ప్రజలు మరే విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఓటుకు నోటు కేసులో ఏం జరుగుతుంది అన్నదే అందరి ప్రశ్న. రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఇదే ఉత్కంఠ. ఓటు నోటు కేసులో బుక్కైపోయిన రేవంత్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే బాబు ఆడియో టేపులతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఏసీబీ ఎలా ముందుకు వెళ్లనుందనేది ఏపీ, తెలంగాణలో టెన్షన్‌ రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 14 వీడియో, ఆడియో టేపులు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు చేరాయి. ఈ ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ను ఆధారంగా చేసుకొని రాబోయే రోజుల్లో కీలక మలుపులు ఉండే అవకాశాలున్నాయి.

ఓటుకు నోటు కేసులో ఈ నెల పదిహేను వరకు రేవంత్‌ను రిమాండ్‌కు పంపింది కోర్టు. అయితే..ఆ గడువు ఈ రోజుతో ముగియనుంది. దీంతో ఆయన్ను ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. దీనికి తోడు ఈ కేసులో ఫిర్యాదుదారుడు స్టిఫెన్‌సన్‌ వాంగ్మూలాన్ని రికార్డ్  చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. కేసులో అతి కీలకంగా భావిస్తోన్న స్టిఫెన్‌సన్‌ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసేందుకు ఏసీబీ ఇప్పటికే కోర్టు అనుమతి తీసుకుంది. దీంతో ఈ రోజే స్టిఫెన్‌సన్‌ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసే అవకాశాలున్నాయి. ఓటుకు నోటు కేసులో ఎవరెవరి ప్రమేయం ఉంది...తనను ఎవరెవరు సంప్రదించారనే అంశాలపై వాంగ్మూలాన్ని తీసుకునే ఛాన్సుంది. ఇక రేవంత్‌ను కోర్టులో హాజరుపర్చిన తర్వాత...కేసు స్టేటస్‌రిపోర్ట్‌గానీ..మెమోగానీ దాఖలు చేసే అవకాశాలున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  Tdp  telangana  money for vote  

Other Articles