KCR | Jagan | Chandrababu | Ap | Telangana

In ap ysjagn facing new problems by supporing kcr

KCR, Jagan, Chandrababu, Ap, Telangana

In ap Ysjagn facing new problems by supporing KCR. Jagan suppoted Kcr on Chandrababu issue. cash for vote issue, Jagan support the telangana govt and kcr.

ఏపిలో జగన్ కు ఎదురుగాలి.. కారణం కేసీఆర్..!

Posted: 06/15/2015 07:54 AM IST
In ap ysjagn facing new problems by supporing kcr

తానొకటి తలిస్తే దైవమొకటి తలిచింది అన్న చందాన జగన్ టిఆర్ఎస్ తో చేతులు కలపడం ఇబ్బందులను పుట్టిస్తోంది. అటు జగన్, ఇటు కేసీఆర్ ల రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడు. కాబట్టి టిఆర్ఎస్ పార్టీతో దోస్తీకి సిద్దపడింది వైయస్సార్ సీపీ. కానీ ఏపిలొ మాత్రం జగన్ కు ఈ దోస్తీ చేటు చేస్తోంది.తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన వైసీపీ అధ్యక్షుడు వైఎ్‌స.జగన్మోహన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌లో వ్యతిరేకత పెరుగుతోంది.  చంద్రబాబు నాయుడు అంశాన్ని పక్కనపెడితే.. కేసీఆర్‌ను వ్యతిరేకించాల్సింది పోయి జగన్ మద్ధతు ప్రకటించడంపై ఏపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేసీఆర్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్‌ చేపట్టిన ఆందోళనలు ఫ్లాప్‌ కావడం గమనార్హం. కేసీఆర్‌కు అండగా నిలిచేందుకే జగన్‌ ఆందోళనలకు పిలుపునిచ్చారని ప్రజలు భావించారంటున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో తాను బాబుకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిమాట.. కేసీఆర్‌కు మద్దతిస్తున్నట్లుగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారట.
 
కేసీఆర్‌ ఇటీవల శంకుస్థాపన చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలోనూ జగన్‌ మౌనంగా ఉండటం ఏపీలో, మరీ ముఖ్యంగా రాయలసీమలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్ర రాజకీయ పరిణామాలను, ప్రజల ఆగ్రహాన్ని గుర్తించిన జగన్‌ దిద్దుబాటు ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి వివరిస్తూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి ఆదివారం ఒక లేఖ రాశారు. అయితే ఈ లేఖ ఘాటుగా లేదంటూ రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టకుండా ఆపాలంటూ కేంద్ర మంత్రులందరి గుమ్మాలు ఎక్కిన జగన్‌... తెలంగాణ నీటి ప్రాజెక్టు విషయంలో మాత్రం కేంద్ర మంత్రికి లేఖ రాసి చేతులు దులుపుకొన్నారని అంటున్నారు. మరి వైయస్ఆర్ సీపీ పార్టీ ఓటు బ్యాంకును ఎలా కాసాడుకుంటుందో చూడాలి. జగన్ దీనిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Jagan  Chandrababu  Ap  Telangana  

Other Articles