ఓటుకు నోటు వ్యవహారంలో నేడు ఎంతో కీలకంగా ఉండబోతోంది. తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ కేసులో ఏసీబీ విచారణ పూర్తైంది. జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగుస్తోంది. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ వ్యవహారం ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేదిగా ఉందని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి గతంలో పేర్కొన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డికి మరికొన్ని రోజులు రిమాండ్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 14 రోజుల పాటు రిమాండ్ లో ఉన్న రేవంత్ రెడ్డి.. ఒక్క రోజు అది కూడా కూతురు నిశ్చితార్థం కావడంతో తాత్కాలిక బెయిల్ మీద విడుదలయ్యారు. కానీ గట్టి నిఘా మధ్య చాలా ఆంక్షల మధ్య రేవంత్ బయటకు వచ్చారు. అయితే 14 రోజుల రిమాండ్ ముగిసిపోవడంతో నేడు కోర్టుకు హాజరుకానున్నారు రేవంత్.
ఇక ఇదే కేసులో మరో కీలక సన్నివేశం చోటుచూసుకోనుంది. ఓటుకు నోటు వ్యవహారంలో అతి కీలకంగా వ్యవహరించిన నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని నేడు ఏసీబీ అధికారులు రికార్డు చెయ్యనున్నారు. ఈ వ్యవహారంలో సోమవారం అత్యంత కీలక పరిణామాలు జరుగనున్నాయి. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయనుండడంతో పాటు వీడియో, ఆడియో రికార్డులకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక న్యాయస్థానానికి అందనుంది. చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో స్టీఫెన్‌సన్ వాంగ్మూలం కీలకం కానుంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more