Indian Student from Hyderabad Shot Dead in Florida, america | Florida | i phone | indian student

Hyderabad student shot dead in us by a african

indian student, hyderabad student shot dead, indian student dead in america, telugu man, miami, florida, Hyderabad Student, telangana news, breaking news

A 21-year-old Indian origin student Sai Kiran from Hyderabad was brutally murder in the US Miami, Florida by a African for an iPhone.

ITEMVIDEOS: అమెరికాలో దారుణం.. ‘ఐ ఫోన్’ కోసం కాల్చిచంపిన అమెరికా నల్లజాతీయుడు

Posted: 06/14/2015 07:00 PM IST
Hyderabad student shot dead in us by a african

అమెరికాలో దారుణం జరిగింది. మనిషి ప్రాణం కన్నా ఐ ఫోన్ కే అధిక ప్రాధ్యనమిచ్చిన అమెరికాలోని నల్లజాతీయుడు.. భారతీయుడిపై నాలుగు రౌండ్లు కాల్పలు జరిపి ప్రాణం తీశారు. సదరు భారతీయుడు హైదరాబాద్ కు చెందిన యువకుడు సాయి కిరణ్.  హైదరాబాద్ లోని కుషాయిగూడ ప్రాంతానికి చెందిన సాయికిరణ్(21) అనే యువకుడిని దుండగులు కాల్చి చంపారు. ఫ్లోరిడాలోని మియామి ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. తన స్నేహితులతో కలసి వెళ్తున్న సాయికిరణ్.. హైదరాబాద్ లో  తమ ఇంటికి చేరువలో వుండే మరో మిత్రుడితో కలసి ఫోన్ లో మాట్లాడుతూ.. మెల్లిగా కదిలాడు. దీంతో స్నేహితులకు తనకు కొంత దూరం ఏర్పడింది.

సాయికిరణ్ వెనకగా నడుస్తుండటం, అతను ఐఫోన్ లో మాట్లాడటాన్ని గమనించిన నల్లజాతీయులు అతడిని చుట్టుముట్టారు. ఐ ఫోన్ ఇవ్వమని బెదిరించగా.. అందుకతను నిరాకరించాడు. దీంతో అతడిపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపిన దుండగులు ఐ ఫోన్ సహా.. అతడి జేబులోంచి డబ్బును కూడా దోచుకుని పరారైనట్లు సమాచారం. అగ్రరాజ్యంలో నల్లజాతీయుల చేతిలో తమ కుమారుడు సాయికిరణ్ హత్య చేసినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. 45 రోజుల క్రితమే ఉన్నత చదువుల కోసం సాయికిరణ్ అమెరికా వెళ్లాడు. కుమారుడి మరణ వార్తతో సాయికిరణ్  తల్లిదండ్రులు పుత్రశోకంతో శోకసంధ్రంలో మునుగగా, సదరు కాలనీలో విషాదంఛాయలు అలుముకున్నాయి

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telugu man  miami  florida  Hyderabad Student  

Other Articles