mlc somireddy slams telugu states governor narasimhan

Somireddy takes on telugu states governor

somireddy takes on telugu states governor, Somireddy Chandramohan Reddy, TDP MLC, narsimhan, governor narasimhan, KCR, rubber stamp, note for vote, cash for vote, AP chief minister chandrababu, phone conversation, Revanth reddy, mla stphenson, phone signals, Forensic Science Laboratory, tower location, jubliee hill, road number 24, Telangana TDP, cash for vote, note fo vote, Telangana government, ACB officials, balakrishna, nara lokesh, chandrababu, jagan, congress, vote for note, Geeta Reddy, Revanth Reddy Case, Telangana TDP

andhra pradesh tdp mlc somireddy chandramohan reddy slams telugu states governor narasimhan, says governer is not a rubber stamp

అటు తిరిగి.. ఇటు తిరిగి.. గవర్నర్ ను టార్గెట్ చేసిన టీడీపీ

Posted: 06/14/2015 02:41 PM IST
Somireddy takes on telugu states governor

ఓటుకు నోటు కేసు వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మెడుకు చుట్టుకుంది. గవర్నర్ నరసింహన్ తలచుకుంటే తమ తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబి ఉచ్చులో చిక్కుకునే వారేకదనుకున్నారో..? లేక ఆయనకు తెలియకుండా ఈ తతంగమంతా జరిగిందా..? అనుకున్నారో మొత్తానికి గవర్నర్ ను టార్గెట్ చేశారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గవర్నర్ అంటే రబ్బరు స్టాంప్ కాదంటూ మండిపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్.. ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా గవర్నర్ నోరు మెదపడం లేదని విమర్శించారు. రాష్ట్ర పునర్విభజన చట్టానికి తూట్లు పోడుస్తూ.. కేసీఆర్ సర్కార్ ఏడాది పాలనలో తీసుకున్న పది నిర్ణయాలపై కోర్టు అక్షంతలు వేసినా.. గవర్నర్ కు కనిపించడం లేదా..? అని ఆయన ప్రశ్నించారు.

కేసీఆర్ నిర్ణయాలు కోర్టులకు తెలుస్తున్న నరసింహన్కు మాత్రం తెలియడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్ర ప్రజా వ్యతిరేక విధానాలు ఒకటవ తరగతి విద్యార్థికి అర్థమవుతున్నా.. గవర్నర్ కు మాత్రం అర్థం కావడం లేదని ఆయన దుయ్యబట్టారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సీమాంధ్రుల హక్కులకు భంగం కలుగుతుంటే, గవర్నర్ చోద్యం చూస్తున్నారని విరుచుకుపడ్డారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 కల్పించిన విశేషాధికారాలను వినియోగించడంలో గవర్నర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు న్యాయం చేయలేని గవర్నర్,  రాజ్భవన్ ఎందుకు అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ ఉత్సవ విగ్రహాం కాదని సోమిరెడ్డి స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భాష అసహ్యించుకునేలా ఉందన్నారు. ప్రతి అంశాన్ని కేసీఆర్ సర్కార్ వివాదం చేస్తోందని తెలిపారు. కోర్టులు అక్షంతులు వేసిన కేసీఆర్ తీరు మాత్రం మారడం లేదని సోమిరెడ్డి చెప్పారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Somireddy Chandramohan Reddy  TDP MLC  narsimhan  KCR  

Other Articles