Helped Lalit Modi with travel papers on humanitarian grounds, Sushma Swaraj says

Sushma swaraj in lalit modi visa controversy defends action

UK government, Sushma Swaraj, Lalit Modi, Keith Vaz, External Affairs Minister, Delhi High Court, Digvijay singh, Congress party Leader, sushma swaraj, UK's top immigration official, British travel papers to Lalit Modi, British High Commissioner, humanitarian view, Indo-UK relations

External Affairs Minister Sushma Swaraj's name has been dragged into the controversy surrounding grant of visa to former IPL chief Lalit Modi by the UK where the matter is before a parliamentary panel

వివాదంలో చిక్కుకున్న కేంద్రమంత్రి సుష్మా.. రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్

Posted: 06/14/2015 02:01 PM IST
Sushma swaraj in lalit modi visa controversy defends action

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వివాదంలో చిక్కకున్నారు. ఐపిఎల్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఐపీఎల్ మాజీ చైర్మన్, నిధుల దుర్వినియోగం కేసులో అభియోగాలు ఎదుర్కోంటున్న లలిత్ మోడీకి లండన్ వీసా కల్పించే విషయమై అమె సిఫార్సు చేస్తూ అక్కడి ప్రభుత్వానికి లేఖ రాయడం వివాదాస్పదమైంది. దీంతో సుష్మా స్వరాజ్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదంపై సుష్మ స్పందించారు. తాను లలిత్ మోడీకి వీసా కల్పించే విషయంలో అతడికి సహకరించానని అమె అంగీకరించారు.

లలిత్ మోడీ విషయంల తాను కేవలం మానవత్వ కోణంలోనే స్పందించి సహకరించానని చెప్పారు. గత ఏడాది జులై మాసంలో లలిత్ మోడీ తనను కలిశారని, తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని, అమెకు కాన్సర్ వ్యాధి సోకిందని, చెప్పారని సుష్మ స్వరాజ్ చెప్పారు. అమె కాన్సర్ వ్యాధి చికిత్సలో భాగంగా ఫోర్చుగల్ లో ఆగస్టు 4న శస్త్ర చికిత్స చేసేందుకు కూడా సమయం ఫిక్స్ అయ్యిందని, ఆ సమయంలో సంబంధిత డాక్యుమెంట్లపై తాను సంతకం చేయాల్సిన అవసరం వుందని లలిత్ మోడీ తన దృష్టికి తీసుకోచ్చారని ఈ నేపథ్యంలో తాను మానవత్వంతో స్పందించడం ఎలా తప్పు అవుంతుందని అమె ప్రశ్నించారు.

కాగా, రెడ్ కార్నర్ నోటీసులు ఎదుర్కొంటున్న లలిత్ మోదీకి ఏ విధంగా వీసా మంజూరుకు సిఫార్సు చేశారని సుష్మాను కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. న్యూఢిల్లీలో సుష్మా స్వరాజ్ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్  మండిపడ్డారు. నైతికత ఆధారంగా సుష్మా వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  అటు కాంగ్రెస్ మరో అగ్రనేత షకీల్ అహ్మద్ కూడా సుష్మా స్వరాజ్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సదరు విషయమై ప్రధాని నరేంద్రమోడీ.. స్వయంగా విచారణ జరిపించి అమెను బర్తరఫ్ చేయాలన్నారు. అటు జనతా దళ్ యు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి త్యాగీ కూడా సుష్మా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Digvijay singh  sushma swaraj  external affairs minister  lalit modi  

Other Articles